టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ కు గతంలో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్దల నేపథ్యంలో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా మనోజ్ భూమా మౌనికా రెడ్డితో కలిసి హైదరబాద్ లోని ఓ గణేష్ మండపం వద్ద సందడి చేశారు.
Advertisement
అప్పటి నుండి మనోజ్ మౌనికా రెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా గత కొద్ది రోజులుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక మనోజ్ హీరోగా పలు చిత్రాలలో నటించగా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సరైన హిట్స్ లేకపోవడంతో మనోజ్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.
Advertisement
మౌనికా రెడ్డి విషయానికి వస్తే ప్రముఖ దివంగత రాజకీయనాయకులు భూమా నాగిరెడ్డి కుమార్తెగా ఆమె పరిచయం అయ్యారు. మౌనికా రెడ్డి గత ఎన్నికల్లో తన సోదరి తరపున చురుకుగా ప్రచారం చేశారు. టీడీపీలో యాక్టివ్ గా ఉంటూ పలుసార్లు మీడియా ముందుకు కూడా వచ్చారు. ఇక మనోజ్ మౌనికా రెడ్డి గణేష్ మండపం వద్దకు వచ్చిన సమయంలో మీడియా మనోజ్ ను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా త్వరలోనే చెబుతానని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
అయితే ఇప్పటి వరకూ మనోజ్ పెళ్లి పై కానీ పొలిటికల్ ఎంట్రీ పై కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా మనోజ్ మౌనికలు పెళ్లి పై ప్రకటన చేయకపోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ కు ఇప్పటికే అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. కానీ మౌనికారెడ్డికి ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి అవ్వలేదట. ఆ కారణంతోనే మనోజ్ మౌనికారెడ్డిలు తమ పెళ్లి ప్రకటన చేయడానికి ఆలస్యం చేస్తున్నారట.