Telugu News » Blog » గాడ్ ఫాదర్ సినిమా ని భయపెడుతున్న ఆ ఒక్క అంశం ఏదో తెలుసా ? ఆ నాలుగు అంశాలు సరిగ్గానే ఉన్నా..!

గాడ్ ఫాదర్ సినిమా ని భయపెడుతున్న ఆ ఒక్క అంశం ఏదో తెలుసా ? ఆ నాలుగు అంశాలు సరిగ్గానే ఉన్నా..!

by AJAY
Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆచార్య సినిమా అట్ల‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. అయితే ఈ సినిమాకు ముందు కొర‌టాల కెరీర్ లో అస‌లు ఫ్లాప్ లేక‌పోవ‌డం..చిరు చ‌ర‌ణ్ లు క‌లిసి న‌టించ‌డంతో చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కానీ ఆ అంచ‌నాలు రీచ్ అవ్వ‌లేక‌పోయింది.

Ads

దాంతో ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ మెగ‌స్టార్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాను మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా లూసీఫ‌ర్ కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. అయితే ఈ సినిమా కు సంబంధించి కూడా కొన్ని విష‌యాలు ఫ్యాన్స్ ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…సినిమా టీజ‌ర్ విడుద‌లవ‌గా ఒరిజిన‌ల్ కంటే ఇందులో ఎలివేష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని సినిమా ల‌వర్స్ అనుకుంటున్నారు.

Ads

గాడ్ ఫాద్ సినిమా చాలా మంది ఇప్ప‌టికే ఓటిటిలో స‌బ్ టైటిల్స్ చ‌దువుతూ చూశారు. నిజానికి సినిమా క‌థ అంద‌రికీ తెలిసిందే అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాలోని ట్విస్ట్ లు కూడా ప్రేక్ష‌కుల‌కు నచ్చే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని క్లైమాక్స్ లో అర్థం అవుతుంది. కాబ‌ట్టి గాడ్ ఫాదర్ హిట్ అయితే దీనికి సీక్వెల్ గా గాడ్ ఫాద‌ర్ 2 వ‌చ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

god father1

అదేవిధంగా మోహ‌న్ రాజా రీమేక్ లు తీయ‌డంలో దిట్ట కాబ‌ట్టి ద‌ర్శ‌కుడి పని విష‌యంలోనూ ఫ్యాన్స్ కు అనుమానాలు లేవు. ఇక ఆచార్య సినిమా విష‌యంలో నిరాశ‌గా ఉన్న చిరు గాడ్ ఫాద‌ర్ విష‌యంలో చిరు అలాంటి మిస్టేక్స్ ను పున‌రావృతం చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారు. ఇక లూసీఫ‌ర్ లో హీరోయిన్ ఉండ‌దు….కాబ‌ట్టి ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ లోనూ హీరోయిన్ ఉన్న‌ట్టు ప్ర‌క‌టించ‌లేదు కాబ‌ట్టి హీరోయిన్ ఉండే అవ‌కాశం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒకే ఒక‌విష‌యం ఫ్యాన్స్ కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. గాడ్ ఫాద‌ర్ లో స‌ల్మాన్ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హిందీ మార్కెట్ కోసం స‌ల్మాన్ సినిమాలో భాగం చేశారు. అయితే స‌ల్మాన్ కు ఎలివేష‌న్ సీన్లు ఉంటే మాత్రం సినిమా పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Ad

ALSO READ : ఎన్టీఆర్ బాల‌య్య క‌లిసి బాహుబ‌లి రేంజ్ సినిమాలో న‌టించార‌ని తెలుసా..? ఆ సినిమా ఎందుకు విడుద‌ల‌వ్వ‌లేదంటే..?