2008 లో ప్రారంభమైన ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇందులో పాల్గొనే జట్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇందులో ప్రస్తుతం 10 జట్లే ఉన్నా మూడు, నాలుగు జట్లకు మాత్రమే విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఒక్క జట్టే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు.
Advertisement
సోషల్ మీడియాలో ఈ జట్టు చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ ఆటగాళ్లకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ, అభిమానులతో ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ జట్టుకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను 64 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ట్విట్టర్ ఖాతాను సడన్ గా కొందరు స్కామర్లు హ్యాక్ చేసేసారు. ఇలా హ్యాక్ చేసిన వాళ్ళు అకౌంట్ పేరును ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’ అని మార్చేశారు.
Advertisement
అక్కడితో ఆగకుండా తమలో సభ్యులు కావాలని అనుకుంటే ఓపెన్ సీలో తమ కంపెనీకి చెందిన బోర్డు ఏప్ లేదా మ్యూటెంట్ ఏప్ ను కొనుగోలు చేయాలని సూచించారు. ట్విట్టర్ బయో నిండా తమ కంపెనీకి చెందిన లింకులు పోస్ట్ చేశారు. అలాగే కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఇలా ఆర్సిబి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవడం ఇదే తొలిసారి కాదు. 2021 లో కూడా ఒకసారి ఈ ట్విట్టర్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. తాజాగా జరిగిన ఈ హ్యాక్ ఎటాక్ నుంచి మళ్లీ ఆర్సిబి తమ ఖాతాను సెక్యూర్ చేసుకుందా? లేదా? ఇంకా తెలియరాలేదు.
read also : India vs New Zealand, 2nd ODI : టీమిండియా జైత్ర యాత్ర.. కివీస్ పై 2-0తో వన్డే సిరీస్ కైవసం