Home » టైగర్ నాగేశ్వరరావు మీద పెట్టుకున్న ఆశలు అన్నీ వృధానేనా..? ప్లస్, మైనస్ లు ఇవే..!

టైగర్ నాగేశ్వరరావు మీద పెట్టుకున్న ఆశలు అన్నీ వృధానేనా..? ప్లస్, మైనస్ లు ఇవే..!

by Sravya
Ad

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. భగవంత్ కేసరి, లియో సినిమాలతో గట్టి పోటీని ఈ మూవీ ఎదుర్కొంటోంది. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా కొంచెం లెన్తీ గా ఉండడంతో ప్రేక్షకులు కాస్తా నిరాశ చెందుతున్నారు. బలహీనమైన సెకండ్ హాఫ్, అలానే విజువల్ ఎఫెక్ట్ లతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా ప్లస్లు, మైనస్లు విషయానికి వచ్చేద్దాం.. 1970 లలో రైళ్లు, బ్యాంకులని దోచుకోవడంలో పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు చేసిన నేరాలు చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. అలానే ఆయన జీవితాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. ప్రేమగల భర్త, తండ్రి అలానే క్రూరమైన అక్రమార్కునిగా రవితేజ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో త్రిల్లింగ్ యాక్షన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు రైలుని హైజాక్ చేయడం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలలు, నేపథ్య సంగీతం చాలా బాగుంది.

Advertisement

దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టింది. సెకండ్ హాఫ్ లో కథనంపై పట్టు కోల్పోయి రిపీట్ అవుతూ బోరింగ్ అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయని అంతా అంటున్నారు. సినిమాలో ఒక్క సీన్ కూడా రీయల్ గా లేదని అన్నారు. పైగా రవితేజ సినిమా నుండి కోరుకున్నంత ఎంటర్టైన్మెంట్ దక్కలేదని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాత్ర మానసిక అంశాలను బందిపోటుగా మారడానికి అతని ప్రేరణలను అన్వేషించడంలో కూడా ఈ సినిమా ఫెయిల్ అయింది. సినిమా అంచనాలకి తగ్గట్టుగా లేదని ఆడియన్స్ అంటున్నారు.

Also read:

Visitors Are Also Reading