Chalapathi Rao: సీనియర్ నటుడైన చలపతిరావు మృతితో టాలీవుడ్ లో తీరని విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి నటనకు దూరమైన చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు..
Advertisement
కుమారుడైన రవి బాబు ఇంట్లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 1200 కి పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు , విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. ఇండస్ట్రీలో ఎవరితో అయినా ఆప్యాయంగా మాట్లాడే చలపతిరావును అందరూ బాబాయిగా పిలుస్తారు. అలాంటి చలపతిరావు నిజ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి.
also read:పాలలో సోంపు పొడి కలుపుకొని ఆ టైంలో తాగితే..ఎన్ని లాభాలంటే..?
Advertisement
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చలపతిరావు సతీమణి పేరు ఇందుమతి. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను ఒప్పించాడు. చెన్నైలో నివాసం ఉంటున్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పంటడంతో ఆమె తీవ్రంగా గాయాల పాలయ్యారు. మూడు రోజుల చికిత్స అనంతరం కన్నుమూశారు. ఆ సమయంలో రవిబాబు వయస్సు 7 సంవత్సరాలు. అయితే పిల్లల కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమిలాడినా చలపతిరావు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్ళీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు.
Chalapathi Rao Son Name
కానీ చలపతిరావు ససేమిరా తిరస్కరించాడు. ఇదిలా ఉండగా సిల్లీ ఫెలోస్ అనే మూవీ షూటింగు టైంలో ఆయన ఒక పెద్ద యాక్సిడెంట్ కు గురయ్యారు. దాదాపుగా ఎనిమిది నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితమై ఆ సమయంలోనే కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇలా చలపతిరావు జీవితంలో ఎన్ని విషాదాలు ఎంటర్ అయిన ఎక్కడ కూడా ఆయన భయపడకుండా తన పిల్లలను మంచి పొజిషన్ లో ఉంచాడు. ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడే చలపతిరావు ఇలా గుండెపోటుతో మరణించడం బాధాకరం.
also read: