Home » నా బ‌రువు త‌గ్గించుకుంటా నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? రిపోర్ట‌ర్ కు కేజీఎఫ్ న‌టి స్ట్రాంగ్ కౌంట‌ర్…!

నా బ‌రువు త‌గ్గించుకుంటా నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? రిపోర్ట‌ర్ కు కేజీఎఫ్ న‌టి స్ట్రాంగ్ కౌంట‌ర్…!

by AJAY
Ad

కొన్నిసార్లు రిపోర్ట‌ర్ లు టీవీ యాంక‌ర్ లు అడిగే ప్ర‌శ్న‌లు సెల‌బ్రెటీల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. రీసెంట్ గా విశ్వ‌క్ సేన్, డీజె టిల్లు హీరో సిద్దు విష‌యంలోనే అది చూశాం. బోల్డ్ ప్ర‌శ్న‌లు అనుకుంటారు కానీ అవి సెల‌బ్రెటీల‌ను ఎంత‌గా గాయ‌ప‌రుస్తారో కొన్నిసార్లు అర్థం చేసుకోరు. కేవ‌లం హీరోల‌కు మాత్రమే కాకుండా న‌టీమ‌ణుల‌కు కూడా ఇలాంటి ప్ర‌శ్నలు ఎదురవుతు ఉంటాయి. అయితే తనకు గ‌తంలో బాడీ షేమింగ్ పై ఎదురైన ప్ర‌శ్న‌ను కేజీఎఫ్ న‌టి ర‌వీనా టండ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకుంది.

Advertisement

బాలీవుడ్ లో హీరోయిన్ గా న‌టించి ర‌వీనా టండ‌న్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇక కేజీఎఫ్ లో న‌టించి పాన్ ఇండియాను ర‌వీనా టండ‌న్ త‌న వైపు తిప్పుకుంది. కాగా ర‌వీనా టండ‌న్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ….కేజీఎఫ్ 2 కు మంచి క‌లెక్ష‌న్ లు వ‌స్తున్నాయంటే సౌత్ ఇండ‌స్ట్రీ డ‌బ్బులు సంపాదించుకోవ‌డం దృష్టి పెట్టింద‌ని దాని అర్థం కాద‌ని చెప్పింది.

Advertisement

సినిమా పై వారికి ఎంత ప్రేమ ఉందో అక్క‌డ అర్థం అవుతోంద‌ని ర‌వీనా టండ‌న్ చెప్పుకొచ్చింది. పైగా ఇక్క‌డ థియేట‌ర్ య‌జ‌మానులు లాభం పొందుతున్నార‌ని ర‌వీనా టండ‌న్ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా గ‌తంలో ప్ర‌స‌వం స‌మ‌యంలో తాను లావెక్కిన విష‌యాన్ని గుర్తు చేసింది. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు లావ‌య్యాన‌ని ర‌వీనా టండ‌న్ చెప్పుకొచ్చింది.

బాబుకు జ‌న్మ‌నివ్వ‌గానే తిరిగి వ‌ర్కౌట్ మొద‌లు పెట్టాన‌ని చెప్పింది. కానీ అప్ప‌టికే లావయ్యానంటూ త‌న‌పై ఐశ్వ‌ర్యరాయ్ పై ట్రోల్స్ చేయ‌డం మొద‌లు పెట్టార‌ని తెలిపింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్ర‌శ్న త‌న‌కు ఇంకా గుర్తుంద‌ని చెప్పింది. మీరు బ‌రువెక్కారు కాబ‌ట్టే క‌ష్ట‌ప‌డ‌కుండా రియాలిటీ షోలు చేస్తున్నారా అంటూ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించాడ‌ని తెలిపింది. దాంతో తాను…బ్ర‌ద‌ర్ నేను నా బ‌రువు త‌గ్గించుకోగ‌ల‌ను…నువ్వు నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్ అని అన్నానని చెప్పింది.

Also read :

ఒకే టైటిల్ తో వచ్చిన బాలకృష్ణ, శోభన్ బాబు.. ఎవరి సినిమా హిట్ అయ్యిందో తెలుసా..?

Visitors Are Also Reading