Home » ఇండియా పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు..!

ఇండియా పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ మధ్య శత్రుత్వం చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థుతుల కారణంగా గత దశాబ్ద కాలంగా ఇండియా , పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. ఇక ఈ రెండు జట్లు ఎదురు పడుతున్నాయి అంటే అది ఐసీసీ టోర్నమెంట్స్ మరియు ఆసియా కప్ అనే చెప్పాలి. అయితే ఐసీసీ ప్రపంచ కప్ లలో పాకిస్థాన్ పైన మన ఇండియాదే పై చెయ్యి. అలాగే ఆసియా కప్ లో కూడా. కానీ గత ఏడాది మొదటిసారిగా గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఇండియా పై విజయం సాధించింది.
అంతే.. ఇక వారు ఏదో సాధించింది విధంగా పాకిస్థాన్ బెస్ట్.. ఇండియా వేస్ట్ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఇప్పుడు ఆ తరహా కామెంట్స్ చేసాడు. అందులో ఇండియా పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు అంటూ పేర్కొన్నాడు. అయితే తాజాగా లతీఫ్ మాట్లాడుతూ.. ఇండియా మంచి జట్టు అనేది అందరికి తెలిసిందే. కానీ గత కొంత కాలంగా పాకిస్థాన్ జట్టు ఆడుతున్న విధానం.. సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మాత్రం పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా ఇండియా లేదు అని చెప్పాడు.
అలాగే ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఇండియా ఆటగాళ్ల కంటే పాకిస్థాన్ ఆటగాళ్లే ముందు వరుసలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది జరిగే ఆసియా కప్ లో ఈ రెండు జట్ల మధ్యే ముఖ్యమైన పోటీ ఉంటుంది. అందులో కూడా పాక్ జట్టు ఇండియాను ఓడిస్తుంది అని అన్నాడు. అలాగే ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ లో ఇండియాను గత ఏడాది లాగే పాకిస్థాన్ ఓడిస్తుంది అని లతీఫ్ పేర్కొన్నాడు. అయితే గత ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాబట్టి ఆ ఓటమికి ఈ ప్రపంచ కప్ లో ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా అనుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading