Home » చరణ్ సంచలన వ్యాఖ్యలు…మౌనం వీడితే తట్టుకోలేరని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్!

చరణ్ సంచలన వ్యాఖ్యలు…మౌనం వీడితే తట్టుకోలేరని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్!

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించగా, శృతిహాసన్ చిరుకు జోడిగా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను వరంగల్ లో ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు చిరు, రవితేజ, టిఆర్ఎస్ నేతలు తదితరులు వచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ మీట్ కు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు.

Advertisement

 

అంతేకాదు తన నాన్న జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటూ ప్రత్యర్థులను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాంచరణ్ మాట్లాడుతూ, “చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇన్ని వేల మంది వచ్చాము. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో ఇతరులకు తెలియదు. ఆయన నెమ్మదిగా ఉంటారేమో, మేము నెమ్మదిగా ఉండడం, అందరూ గుర్తు పెట్టుకోండి “, అంటూ రాంచరణ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

Advertisement

“ఒక అభిమానిగా వచ్చా, చిరంజీవి గారి ఫంక్షన్ కు ఆయనే గెస్ట్, ఇంకెవరు అవసరం లేదు. ఈ సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను, గుర్తుపెట్టుకోండి మేము అందరం వెనకాల క్వైట్ గా ఉండము, క్వైట్ గానే చెబుతున్నాం. మేము క్వైట్ గా ఉండమని” అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్లు చేసి వారికి ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే, వైసిపి నేతలైన మంత్రి రోజాకు పరోక్షంగా చరణ్ కౌంటర్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

 

READ ALSO : Vasthu tips : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే సమస్యలు తప్పవు

Visitors Are Also Reading