Home » Vasthu tips : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే సమస్యలు తప్పవు

Vasthu tips : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే సమస్యలు తప్పవు

by Bunty
Ad

మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఇల్లు కట్టేటప్పుడు ప్రతిదీ వాస్తు ప్రకారం గా నిర్మించాలని అనుకుంటారు. అందువల్లే వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు అంటే ఇళ్ల నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో అమర్చే వస్తువులు ఇతర విషయాల్లోనూ వాస్తుని నమ్ముతుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన ఇబ్బందులు వస్తాయి. పైగా ప్రశాంతంగా ఉండటానికి కూడా అవ్వదు. ఇంట్లో ఈ మొక్కలు లేకుండా చూసుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Advertisement

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మొక్కలనే ఉంచకూడదని పండితులు అంటున్నారు. మరి ఎటువంటి మొక్కలు ఇంట్లో ఉంచకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.ఇంట్లో గోరింటాకు మొక్క ఉంటే నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. కాబట్టి ఇంట్లో గోరింటాకు మొక్కని ఉంచకండి. ముళ్ళముక్కలు ఇంట్లో ఉండటం వలన ఇబ్బందులు వస్తాయి. అలానే చింతమొక్క కూడా ఇంట్లో ఉండకూడదు. చింత కూడా చింతని కలిగిస్తుంది.

Advertisement

కాబట్టి చింతకాయ చెట్టుని చింత మొక్కని అసలు ఉంచకండి. పత్తి మొక్క కూడా మంచిది కాదు. పత్తి మొక్క ఇంట్లో ఉండడం వలన ఆర్థిక నష్టం వస్తుంది. ఇబ్బందులు వస్తాయి. అలానే బోన్సాయ్ మొక్కని కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇది కూడా ఇబ్బందులను తీసుకువస్తుంది. రావి మొక్కని కూడా అసలు ఇంట్లో ఉంచకండి. వీటివలన సమస్యలు వస్తాయి. కాబట్టి ఎటువంటి తప్పులు మీరు చేయకుండా చూసుకోండి. దానితో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

READ ALSO : రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా?

Visitors Are Also Reading