స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని ఫిబ్రవరి 21 న వివాహం చేసుకోనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ న్యూస్ అటు బీ టౌన్ ను ఇటు టాలీవుడ్ ను ఊపేస్తోంది. వీరిద్దరూ ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి వేదికను గోవాకు షిఫ్ట్ చేశారు. గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.
Advertisement
Advertisement
సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్లో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. ఐటీసీ గ్రాండ్ 246 గదులతో కూడిన విలాసవంతమైన హోటల్. 45 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ రిసార్ట్ చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. జాకీ, రకుల్‌లు ఈ హోటల్ని ఎంచుకున్న వెంటనే.. చాలా మందికి దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్లో గది ధర 19 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర 75 వేల రూపాయల వరకు ఉంది. ఇందులో చాలా పన్నులు కూడా ఉన్నాయి. మూడు రోజుల పాటు గోవాలో పెళ్లి వేడుక జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనున్న సంగతి కూడా తెలిసిందే. “రకుల్, జాకీ ఏ అతిథికి పేపర్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అలాగే వివాహ వేదిక వద్ద ఎలాంటి పటాకులు పేల్చరు అని ఈవెంట్ మేనేజర్ వివరించారు.
Also Read : ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ట్రెండింగ్ టాపిక్ ఇదే.!