టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఈమె హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల డాక్టర్ జీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్. అయితే ఆ సినిమా ఆశించిన మేరకు మెప్పించలేకపోయింది. తాజాగా నార్త్ వర్సెస్ సౌత్ మూవీస్ డిబిట్‌లో ఆమె పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Advertisement
ముఖ్యంగా సినిమా అనేది భావోద్వేగా భాష అని, కేవలం ఇది సరిహద్దులు కాదు. నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ అయింది కానీ శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్లు దక్షిణాదిలో కూడా నటించారు అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చాలా సినిమాలు రీమెక్ అయ్యాయి. ఈరోజు వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ కరోనా తరువాత సినిమాల కంటెంట్, విజయం సాధించిన సినిమాల గురించి పెద్ద చర్చనే కొనసాగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒక దశ మాత్రమే అని వెల్లడించింది.
Advertisement
Also Read : నేను చనిపోయేలోపు అన్ని విషయాలు బయటపెడతా…ఉదయ్ కిరణ్ మరణం పై తేజ సంచలన వ్యాఖ్యలు..!
డిజాస్టర్ సినిమాల గురించి రాసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ సినిమా తెరకెక్కించేందుకు చాలా కృషి అవసరమని.. సౌత్ సినిమాలు ఇప్పుడు పి చేస్తున్నాయి. విడుదలైన సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నారు. కరోనా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.. సౌత్ నార్త్ సినిమాలని చూడడం లేదు. వారికి జీవితాల కంటే పెద్ద సినిమాలు కావాలి అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ చివరిసారిగా తెలుగులో కొండ పొలం సినిమాలో నటించింది. హిందీలో థాంక్ గాడ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఛత్రివాలి సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇవే కాకుండా ఈమె చేతిలో తమిళంలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఇండియన్ 2 సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.
Also Read : ఆదిపురుష్ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?