సినిమా ఇండస్ట్రీలో పేరు బట్టి హిరి=ఓలకు రెమ్యునరేషన్ ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. అయితే మన ఇండియాలో బాలీవుడ్ చాలా పెద్ద ఇండస్ట్రీ. అందుకే అక్కడ హీరోలకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ఇండస్ట్రీలు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా హీరోలు తక్కువ ఏం తీసుకోరు. ఇక్కడ పెద్ద హీరోలు అయిన వారు దాదాపుగా 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక కోలీవుడ్ లో దళపతి విజయ్ 60 కోట్లు కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మన ప్రభాస్ వీరందరిని దాటేశాడు.
Advertisement
బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తాజాగా చేస్తున్న ఆదిపురుష్ సినిమాకు 100 నుండి 120 కోట్లు వసూల్ చేస్తున్నట్లు తెలిసిందే. దాంతో ప్రభాస్ ను ఎవరు బీట్ చేయలేరు అనుకున్నారు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ లో ప్రభాస్ ను దాటేశాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం రజినీ చేస్తున్న సినిమా జైలర్. ఈ సినిమాకు సూపర్ స్టార్ భారీగా వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రజినీ కేవలం ఇండియాలోనే కాకుండా మిగితా ఏ హీరోకు లేని విధంగా దుబాయ్, జపాన్ లో కూడా అభిమానానులు ఉన్నారు.
Advertisement
దాంతో రజినీ అంటే ఒక బ్రాండ్. కానీ ప్రస్తుతం రజినీకి పెద్దగా హిట్స్ లేవు. అయిన కూడా జైలర్ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అది ఎంత అంటే.. ఏకంగా 140 కోట్లు. ఇది ఇప్పటివరకు ఏ సినిమాకు అయిన హీరో తీసుకున్న రెమ్యునరేషన్ లో అత్యధికంగా అని చెప్పాలి. బాలీవుడ్ హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఉండదు. కానీ హిట్స్ లేకపోయినా… రజినీ మాత్రం ఏకంగా 140 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ దెబ్బతో సౌత్, నాథ్ తేడా లేకుండా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజినీకత్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి :