Home » విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్‌.. ఏమన్నారంటే..?

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్‌.. ఏమన్నారంటే..?

by Anji
Ad

తమిళ సినీ నటుడు దళపతి విజయ్‌ రాజకీయ ప్రవేశంలపై సీనియర్ నటుడు రజనీకాంత్ స్పందించారు. ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై రజనీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. తమిళనాడులో  అవినీతి పెరిగిపోయిందంటూ స్టాలిన్  ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే ఒకవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళ రాజకీయాలను కుదిపేయనుంది.

Advertisement

Advertisement

కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం‘లాల్‌ సలామ్‌’  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రజనీ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘విజయ్‌ కు నా శుభాకాంక్షలు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో  తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.  రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో ప్రభావం  తగ్గడం.. ఇటీవల డీఎండీకే  అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో కాస్త శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు.

 

ఈ క్రమంలో అధికార డీఎంకేను సీఎం స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే హీరో విజయ్‌ పార్టీని ప్రకటించి.. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఆయన, ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని తెలిపిన విషయం తెలిసిందే.

మరికొన్ని సినిమా వార్తల  కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading