కొంత మంది సినిమా హీరోల వద్దకు మంచి కథలు వచ్చినా కానీ కాల్షీట్స్ ఖాళీ లేకనో.. లేక మరే ఇతర కారణాలతోనే నో చెప్పేస్తుంటారు. కానీ ఆ సినిమా వేరే హీరో చేయడం వల్ల పెద్ద హిట్ అవుతుంటుంది. ఇలాంటి ఇండస్ట్రీలో చాలా జరిగాయి. తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరైన కే.ఎస్.రామారావు క్రియేటివ్ కమర్షయిల్ బ్యానర్ ద్వారా చాలా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాల్లో భారీ విజయాలనే అందుకున్నవి ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన బ్యానర్‌లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల్లో వెంకటేష్ నటించిన ‘చంటి’ ఒకటి.
Also Read: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement
రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ సుజాత వెంకీకి తల్లిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బిగ్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. వెంకటేష్ చాలా అమాయకంగా నటించి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా విడుదలై 30 ఏండ్లు పూర్తయ్యాయి. 1992 సంక్రాంతి కానుకగా సినిమమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కే.ఎస్.రామారావు మరొకసారి ఈ సినిమాను గురించిన విశేషాలను గుర్తు చేసుకున్నారు.
Advertisement
తమిళంలో ప్రభు హీరోగా దర్శకుడు పి.వాస్ చేసిన చిన్నతంబి ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమెక్ చేస్తే బాగుంటుందని.. రవిరాజా పినిశెట్టి, నేను అనుకున్నాం అని కే.ఎస్.రామారావు తెలిపారు. తొలుత రాజేంద్రప్రసాద్ తో పాటు మరికొందరి పేర్లను పరిశీలించాం. అదే సమయంలో సురేశ్‌బాబు ఈ సినిమాను వెంకటేష్‌తో చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ఆయన డేట్స్ ఇస్తే చేయడానికి నేను రెడీ అని చెప్పాను. ఆ తరువాత అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. చంటి పాత్ర కోసం వెంకటేష్ చాలా కసరత్తు చేశారని చెప్పారు కే.ఎస్.రామారావు. ఈ సినిమా పెద్ద హిట్ సాధించడంతో పాటు వెంకటేష్ కెరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచింది.
Also Read: RRR సినిమాలో అదిరిపోయే ట్విస్ట్..!