దేశంలోనే స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే టక్కన చెప్పే పేరు రాజమౌళి. మగధీర సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియానే షేక్ చేశాడు. అంతే కాకుండా పాన్ ఇండియా అనే కొత్త పదాన్నే రాజమౌళి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఒకప్పుడు అన్ని ఇండస్ట్రీలలో పెద్ద ఏదని అడిగితే బాలీవుడ్ అని చెప్పేవారు. కానీ జక్కన్న ఆ హద్దులను బద్దలు కొట్టాడు.
Advertisement
ఏ భాషలో తెరకెక్కిన సినిమా అయినా పాన్ ఇండియాలో విడుదల చేసి సూపర్ హిట్లు అందుకోవచ్చని వేల కోట్ల కలెక్షన్లను రాబట్టవచ్చని నిరూపించాడు. ముఖ్యంగా తెలుగు సినిమాను రాజమౌళి ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. బాలీవుడ్ లోని స్టార్ హీరోలు తనతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నా పుట్టిన గడ్డ పై అభిమానంతో తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వారి టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
Advertisement
ఇక జక్కన్న కెరీర్ లో ఆర్ఆర్ఆర్, మగధీర, బాహుబలి సినిమాలే కాకుండా ఓ సూపర్ హిట్ సీరియల్ కూడా ఉంది. జక్కన్న మొదటగా పరిచయం అయ్యింది కూడా సీరియల్ దర్శకుడిగానే కావడం విశేషం. ఇక రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ సీరియన్ ను రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కించాడు.
అప్పట్లో ఈ సీరియల్ ప్రేక్షకాదరణ పొంది సంచలనాలు సృష్టించింది. ఈ సీరియల్ లో నటించిన నటీనటులు రాజీవ్ కనకాల, సమీర్ తెలంగాణ శకుంతల సినిమాల్లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఈ సీరియల్ తరవాతనే రాజమౌళి స్టూడెంట్ నం 1 సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తరవాత రాజమౌళి ఎక్కడా వెనక్కిచూసుకోలేదు.
ALSO READ ;
నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!
కేజీఎఫ్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డుపై వయలెన్స్ డైలాగ్..!