Home » ఫస్ట్ టైం తన కొడుకుని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ.. ఎంత క్యూట్ గా ఉన్నారంటే..?

ఫస్ట్ టైం తన కొడుకుని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ.. ఎంత క్యూట్ గా ఉన్నారంటే..?

by Sravanthi
Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలోనే వచ్చిన  రాహుల్ రామకృష్ణ మాత్రం మంచి గుర్తింపును సాధించాడు. తనదైన కామెడీతో అందరిని నవ్విస్తూ ఉంటారు. ఓవైపు కమెడియన్ గా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా  తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. కమెడియన్ గా రాణిస్తూనే  విరాటపర్వం, జాతి రత్నాలు, ఆర్ఆర్ఆర్ లాంటి  సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా  పలు వెబ్ సిరీస్ లతో కూడా  నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారారు రాహుల్ రామకృష్ణ. ఇక ఏడాది సంక్రాంతికి ఈ టాలెంటెడ్ యాక్టర్  తండ్రి అయిన విషయం మనందరికీ తెలుసు. తన పెళ్లిని కూడా ఎంతో గోప్యంగా ఉంచి ..
గత నవంబర్లో తండ్రి కాబోతున్నట్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.  అలాగే సంక్రాంతి రోజున అబ్బాయి పుట్టాడని ట్విట్ చేసి తన అభిమానులను  మేస్మరైజ్ చేశాడని చెప్పవచ్చు. కానీ అతని కొడుకు ఫోటోని మాత్రం చూపించలేదు.  ఇన్ని నెలల తర్వాత తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు రాహుల్ రామకృష్ణ. ఇక తన కొడుకు పేరు  రూమీ అని చెబుతూ  ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేశాడు.
అందులో రాహుల్ భార్య కూడా ఉన్నది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.  దీంతో ఆయన ఫ్యాన్స్   రూమి జూనియర్ రాహుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా కొత్తగా పేరు ఉందని  దీనికి అర్థం ఏమైనా ఉందా అంటూ రాహుల్ రామకృష్ణను ప్రశ్నిస్తున్నారు. అయితే రూమీ పాపులర్ పర్షియన్ కవి  అతని పేరును తన తనయుడికి రాహుల్ రామకృష్ణ పెట్టడం మరో విశేషం.

Advertisement

Visitors Are Also Reading