ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులు సంపాదించుకున్నాడు. త్రిబుల్ ఆర్ తో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగడంతో రంగస్థలం మూవీ మేకర్స్ ఆయన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మరో అడుగు ముందుకు వేశారు. విదేశాల్లో రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ ని ఆధారంగా చేసుకుని ఆయన నటించిన చిత్రాలు జపాన్ లో విడుదల చేయడానికి ఈ సన్నాహాలు సిద్ధం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన “రంగస్థలం” తెలుగులో 2018లో విడుదలైన సమయంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో నరేష్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్,అనసూయ, ఆది పినిశెట్టి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. రంగస్థలం రామ్ చరణ్ మరియు సమంత కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఈ జులై 14న జపనీస్ బాషాలో విడుదలై థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా జపాన్ లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జపాన్‌లో విడుదల అయిన రంగస్థలం చిత్రం ‘కెజిఎఫ్ చాప్టర్ 1, 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన మొదటి రోజే 70 స్క్రీన్‌లలో ప్రదర్శించబడి అత్యధికంగా మొదటి రోజే 2.5 యెన్‌లను వసూలు చేసి జపాన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌లో మొదటి రోజున అత్యధికంగా వసూలు చేసిన భారతీయ చిత్రంగా రంగస్థలం నిలిచింది .ఇక గడిచిన వారం రోజులలో టాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం, రంగస్థలం జపాన్ బాక్సాఫీస్ వద్ద 1 కోటి మార్క్ (భారత కరెన్సీలో) చేరుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా జపాన్‌లో దిగ్విజయంగా థియేటర్లలో రన్ అవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!
అతనితో నాకు పెళ్లి జరుగలేదు.. వనిత విజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
నందమూరి హీరోలు కాకుండా నారా బ్రాహ్మణికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?