Home » ఇలాంటి సినిమాలు ఎలా చూస్తారు..? సోషల్ మీడియాలో రాధిక పోస్ట్ వైరల్

ఇలాంటి సినిమాలు ఎలా చూస్తారు..? సోషల్ మీడియాలో రాధిక పోస్ట్ వైరల్

by Anji
Ad

సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. రీసెంట్ గా తాను ఓ సినిమా చూసినట్లు చెబుతూ.. పోస్ట్ పెట్టిన ఆమె ఓ సినిమాను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలు చూస్తే సమాజం దిగజారిపోతుందని, తాను చాలా కుంగిపోయానంటూ పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

ఈ మేరకు తన ట్వీట్ పరిశీలిస్తే..  ‘ఎవరైనా ఈ సినిమా చూసి కుంగిపోయారా? నేను ఫలానా సినిమా చూడాలని అనుకున్నాను. కానీ మధ్యలోనే చాలా కోపంగా అనిపిచింది. నాకు ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేయాలనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాధిక మాట్లాడుతున్నది తాజాగా ఓటీటీలో విడుదలైన ‘యానిమల్‌’ గురించేనని భావిస్తున్నారు. ‘‘మీరు మాట్లాడుతున్నది ‘యానిమల్‌’ గురించే కదా’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక నటించిన ‘యానిమల్‌’కు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.

Advertisement

అంతటా భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. సినిమాలోని చాలా సన్నివేశాల్లో హింసను తీవ్రస్థాయిలో చూపించారని పలువురు విమర్శలు చేశారు. కొన్ని సన్నివేశాల్లో స్త్రీ ని తక్కువ చేసి చూపించారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ క్రమంలోనే రాధిక ట్వీట్‌ చేయడంతో ఆమె మాట్లాడుతున్నది దీని గురించేనని పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading