Home » IPL 2024 : కావ్య పాప దూకుడు..SRH లోకి డేంజర్ ప్లేయర్ !

IPL 2024 : కావ్య పాప దూకుడు..SRH లోకి డేంజర్ ప్లేయర్ !

by Bunty
Ad

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు దీనిపై పలుమార్లు చర్చలు కూడా చేశారు. ఐపీఎల్ 2024 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19వ తేదీ న చాలా గ్రాండ్ గా జరగనుంది.

Quinton de Kock: SRH

ఈ మినీ వేలానికి దుబాయ్ వేదిక కానుంది. ఇలాంటి నేపథ్యంలోనే మినీ వేళానికి ముందే కీలక ప్లేయర్లు టీమ్స్ మారుతున్నారు. ట్రేడింగ్ లో భాగంగా… ఒక జట్టు ప్లేయర్ మరొక జట్టుకు… ఇక్కడ ప్లేయర్ అక్కడికి… అక్కడి ప్లేయర్ ఇక్కడికి ఇలా జట్లు మారుతున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ముంబై ఇండియన్స్ కు వచ్చేసాడు.

Advertisement

Quinton de Kock into SRH

ముంబై ఇండియన్స్ ప్లేయర్ గ్రీన్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెళ్లాడు. ఇక ఇప్పుడు.. లక్నో ఓపెనర్ క్విoటన్ డికాక్ హైదరాబాద్ జట్టుకు రానున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. క్వింటన్ డికాక్ ను ఏడు కోట్ల కు ట్రేడింగులో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading