ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్పదిరైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళం, మళయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు. తెలుగులో దాదాపు రూ.130కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం హీందీలో 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
Advertisement
అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లపైనే వసూలు సాధించిందట. ఏపీలో మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం విశేషం. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడమే దానికి ప్రధాన కారణం. ఏపీలో సినిమాను కొన్న బయ్యర్లు మాత్రం నష్టపోయినట్టు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ నష్టనివారణ చర్యలను తీసుకుంటున్నారట. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.60కోట్లకు అమ్మారట. కానీ ఆ స్థాయిలో లాభాలు మాత్రం రాలేదట.
Advertisement
ఏపీలో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొత్తం 50 శాతాన్ని నిర్మాతల తిరిగి ఇస్తున్నారట. నిజంగా అభినందించాల్సిన విషయం. మరికొన్ని రోజుల్లో పుష్ప సినిమా సెకండ్ తిరిగి ఇస్తున్నారట. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. మరికొన్ని రోజుల్లో పుష్ప సినిమా సెకండ్ పార్ట్‌ను మొదలు పెట్టనున్నారు. ముందుగా ఫిబ్రవరి తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.