అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్ లలో రన్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషలలోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో బన్నీ సుకుమార్ కాంబో లో హాట్రిక్ నమోదయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పలత నటించి అలరించింది.
సినిమాలో తల్లి సెంటిమెంట్ ఉండగా కల్పలత నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్పలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ “అమ్మా మీ ఏజ్ ఎంత” అని తనను అడిగినట్టు తెలిపింది. ఏంటి సార్ అనేసరికి మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నా కంగారు పడకు అన్నారని తెలిపింది. సార్ నాకు 42 ఏళ్లు అనే సరికి హా 42 ఏళ్లేనా అని షాక్ అయ్యారని…ఎంతమంది పిల్లలు అని అడిగినట్టు పేర్కొంది. ఇద్దరు పిల్లలు అనిచెప్పగా వాళ్ళు ఏం చదువుతున్నారు అని అడిగినట్టు పేర్కొంది. ఇద్దరూ జాబ్ చేస్తున్నారని చెప్పగా మళ్లీ బన్నీ షాక్ అయ్యాడని…ఇంతకీ పెళ్లెప్పుడు అయ్యిందని అడిగారని తెలిపింది. ఇంతలోనే సుకుమార్ రాగా మళ్లీ షూట్ చేశామని ఆ తరవాత మళ్లీ అల్లు అర్జున్ తన ఏజ్ గురించి మాట్లాడారని చెప్పుకొచ్చింది.
Advertisement
Advertisement
Also read : సోగ్గాళ్ళ జోరు మామూలుగా లేదు…దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో “బంగార్రాజు”…!
నాకు నీకు ఏజ్ లో ఎంత తేడానో తెలుసా రెండేళ్లు అని అల్లు అర్జున్ అన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత కూడా షూటింగ్ సమయంలో తనను చూస్తూ అల్లు అర్జున్ ఏజ్ గుర్తుచేసుకుని నవ్వారు అని పేర్కొంది. షూటింగ్ లో ఎక్కువ సార్లు తన ఏజ్ గురించే డిస్కషన్ వచ్చిందని తెలిపింది. లొకేషన్ మొత్తం సందడి సందడిగా ఉండేదని అల్లు అర్జున్ కి తనకు మధ్య లెంతీ డైలాగులు ఉండేవని కానీ కత్తిరించి కత్తిరించి అవి చిన్నగా అయిపోయాయని కల్పలత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కల్పలత 50కి పైగా సినిమాలలో నటించారు. అంతేకాకుండా 10 సీరియల్స్ లో నటించారు.