టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతం నాలుగు చిత్రాలను ఒప్పుకున్నాడు. కానీ నాలుగు సినిమాల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. కరోనా ఎఫెక్ట్ ఉండకుంటే ఇప్పటివరకు కనీసం రెండు సినిమాలు అయినా షూటింగ్ సజావుగా సాగి ఉండేవి. కానీ కరోనా అడ్డు తగలడంతో నిర్మాతలకు ఇప్పుడు ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నాటర. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో భీమ్లానాయక్ సినిమా షూటింగ్ ఇంకా సన్నివేశాలు పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం ఈ నెల 25వ తేదీ నుంచి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Advertisement
ఇప్పటికే ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ సినిమాను విడుదల చేస్తాం అని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఓసారి పవన్ కరోనా బారిన పడ్డారు. థర్డ్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో తగ్గేవరకు షూటింగ్‌కు రానుఅని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్ పవన్ పాల్గొనే సన్నివేశాలు పూర్తయితే.. భీమ్లానాయక్ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. లేదంటే మరొకసారి పోస్ట్‌పోన్ తప్పదంటున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయిన పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు కూడా బడ్జెట్ కారణంగానే నిలిచిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
పవన్ కల్యాణ్ డేట్లు సర్దుబాటు చేస్తే నిర్మాత ఫైనాన్షియర్స్ వద్ద డబ్బు సర్దుబాటు చేసుకోవాలని చూస్తున్నారట. కానీ పవన్ మాత్రం కరోనాను దృష్టిలో పెట్టుకొని ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదని టాక్. మరొకవైపు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీశ్‌శంకర్ తెరకెక్కించాల్సిన భవధీయుడు భగత్‌సింగ్ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభమవ్వలేదు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు ఆరంభవుతాయో.. ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిర్మాతలు మాత్రం షూటింగ్‌కు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవర్‌స్టార్ ఎప్పుడూ సెట్లో అడుగు పెడుతారో చూడాలి మరి.