ఒకప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా.. పెళ్లి తర్వాత ఇప్పుడు హాలీవుడ్ లో బిజీ అయింది. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక తన మకాంను లాస్ ఏంజిల్స్ కి మార్చింది. ప్రస్తుతం అక్కడే భర్త నిక్, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి ఉంటుంది. అయితే ఎప్పటికైనా తిరిగి ఇండియాకు వస్తుందని భావించారు ఆమె ఫ్యాన్స్. కానీ ఆమె మాత్రం భారత్ తో సంబంధాలు తెంచుకొని లాస్ ఏంజిల్స్ లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
అందుకే ఇండియాలోని తన ఆస్తులు అన్నింటిని వరుస పెట్టి అమ్ముతోంది. ఆ మధ్య లోకండ్ వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ. 7 కోట్లకు అమ్మేసింది. తాజాగా ముంబైలోని అంధేరి శివారులో ఉన్న అపార్ట్మెంట్ ను కూడా అమ్మకానికి పెట్టేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కు చెందిన అపార్ట్మెంట్ ని బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అభిషేక్ చౌబే భారీ ధరకు కొనుగోలు చేశారట. అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లను దాదాపు రూ.6 కోట్లు చెల్లించారట. ఈ విక్రయాలకు సంబంధించిన పనులను ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నారట.
Advertisement
అక్టోబర్ 23, 25 తేదీల్లో వీటికి సంబంధించిన లావాదేవీలు జరిగినట్టు సమాచారం. అయితే వీటికి సంబంధించి మొత్తం స్టాంప్ డ్యూటీ చార్జీలుగా 36 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత హాలీవుడ్ కి చెక్కేసింది ప్రియాంక. అక్కడే నిక్ జోనస్ తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా లాస్ ఏంజిల్స్ లోనే నివాసం ఉంటుంది. అయితే ఎప్పటికైనా తిరిగి ముంబై వస్తారని ఆమె అభిమానులు ఆశించారు. కానీ ప్రియాంక ఇక్కడి ఆస్తులను వరుస పెట్టి అమ్మకానికి పెడుతోంది. దీన్ని బట్టి చూస్తే.. ప్రియాంక ఇండియాతో సంబంధాలు తెంచుకొని అక్కడే ఫిక్స్ అయిపోయేలా ఉంది. ప్రస్తుతం ప్రియాక చోప్రా.. హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్ సిరీస్ లోను నటిస్తోంది.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!