సాధారణంగా భార్య భర్తల మధ్య వంద గొడవలు జరుగుతాయి. ఆ గొడవలన్నీ నీటి బుడగ లాంటివే. ఇలా దెబ్బలాడుకుని అలా కలిసిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకునే జంట కూడా ఇదే కోవలోకి వస్తుంది. బాలీవుడ్ జంట అంకితా లోఖండే , విక్కీ జైన్ హిందీ బిగ్ బాస్ 17వ సీజన్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ ఉన్నదే ఆలుమగల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ క్రమంలో వీళ్ళు ఎన్నోసార్లు గొడవ కూడా పడ్డారు. ఇక ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే కలిసిపోయారు.
Advertisement
అలాగే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది అంకిత లోఖండే. నాకు ఎందుకో ఒంట్లో అంతగా బాగోలేనట్లు అనిపిస్తోంది. ఈ నెల నాకు పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది అని భర్తతో వాపోయింది. దీంతో ఆశ్చర్యపోయినా భర్త విక్కీ.. అదేంటి..! నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నానే అని చెప్పగా.. లేదు నన్ను మెడికల్ రూమ్ కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. నిన్న రక్త పరీక్షలు చేశారు. ఈరోజు మూత్ర పరీక్ష చేశారు. కానీ ఫలితాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు అని చెప్పుకొచ్చింది.
Advertisement
అందుకే టెన్షన్ అవుతోంది. నేను ఎలా ఫీల్ అవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది అని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాజిటివ్ ఫలితాలు వస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ప్రెగ్నెన్సీ అయిన జంటగా ఈ దంపతులు చరిత్రలో నిలిచిపోతారు. బిగ్ బాస్ 17వ సీజన్ అక్టోబర్ 15న మొదలైంది. ఈసారి కూడా సల్మాన్ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!