వర్షాకాలంలో వర్షాలు కురవడం అనేది కామన్. ఆ సమయంలోనే నదులు, సరస్సులు ఫుల్ గా నీటితో నిండిపోతుంటాయి. ఈ సీజన్ హాయిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. హడలు పుట్టించే వ్యాధులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలయ్యేటప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెట్టాలి. లేదంటే సూచనలేని వర్షాల కారణంగా వ్యాధుల బారిన పడక తప్పదు.
Advertisement
ప్రస్తుతం వర్షాకాలం మొదలైపోయింది. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య కండ్లకలక. తేమతో కూడిన వాతావరణం వల్ల కంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కండ్లకలక కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో ఓ గ్రామంలో ఐదు రోజుల్లోనే 2,300 కండ్లకలక కేసులు రికార్డు అయ్యాయి.
Advertisement
ఈ కారణంగా పాఠశాలలను కూడా మూసివేస్తున్నారు. యమునా నది వరదల కారణంగా గతేడాది కంటే ఈ ఏడాది ఢిల్లీలో ఈ కేసులు ఎక్కువ అయ్యాయి. పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు లేదా ఏదైనా ఎలర్జీ కారకాల వలన కండ్లకలక వస్తుంటుంది. జలుబు లేదా దగ్గు వంటి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల వలన కూడా ఇది రావచ్చు. కళ్ళు ఎర్రగా ఉండి దురద పెట్టడం దీని లక్షణం. కొంతమందికి కంట్లో ధారాపాతంగా నీరు కారిపోతూ ఉంటుంది. పరిశుభ్రతను పాటించడం ద్వారా ఇది రాకుండా చూసుకోవచ్చు. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ను ఉపయోగించడం దీనికి ప్రాధమిక చికిత్స. పదే పదే కంటిని తాకడం, రుద్దడం చేయవద్దు. దిండు కవర్లను తరచూ మార్చుతూ ఉండడం, కంటి ని వేడి నీటితో కడగడం చేయాలి. పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని..
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?