Home » ఆ ఒక్క‌డివ‌ల్లే ప్ర‌భాస్ కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయా..?

ఆ ఒక్క‌డివ‌ల్లే ప్ర‌భాస్ కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయా..?

by AJAY
Ad

సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర‌వాత గాలి వార్త‌లు పెరిగిపోయాయి. ఎక్కడ నుండి పుట్టుకువ‌స్తున్నాయో తెలియ‌దు కానీ గాలి కంటే వేగంగానే వ్యాపిస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్ర‌భాస్ గురించి కూడా అలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ప్ర‌భాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. దాంతో ప్ర‌భాస్ పెళ్లి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతునే ఉంటాయి. అప్ప‌ట్లో ప్ర‌భాస్ తో అనుష్క పెళ్లి అంటూ వార్త‌లు వినిపించాయి.

Advertisement

ఆ త‌ర‌వాత అంతా తూచ్ అని తేలిపోయింది. అంతే కాకుండా ప్ర‌భాస్ కు మ‌ర‌ద‌లు ఉంద‌ని ఆమెనే ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కూడా వార్తలు గుప్పుమ‌న్నాయి. అవి కూడా ఫేక్ వార్త‌లేన‌ని తేలిపోయింది. ఇక కొంత‌కాలంగా ప్ర‌భాస్ హీరోయిన్ కృతిస‌న‌న్ ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం మొద‌ల‌య్యింది. వీరిద్ద‌రూ క‌లిసి ఆదిపురుష్ అనే సినిమాలో న‌టించారు.

Advertisement

కాగా సినిమా షూటింగ్ లో ప్రేమించుకున్నార‌ని ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా త్వ‌ర‌లోనే ఎంగేజ్మెంట్ అంటూ కూడా ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఈ ప్ర‌చారాన్ని చాలామంది న‌మ్మారు కూడా..అయితే అలా నమ్మ‌డానికి కూడా ఒక కార‌ణం ఉంది.

ఆ వార్త‌ల‌ను సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు మొద‌ట ప్ర‌చారం చేశాడు. ఆయ‌న ట్వీట్ తోనే ప్ర‌భాస్ కృతిస‌న‌న్ ల పెళ్లి వార్త‌లు మొద‌ల‌య్యాయి. అలా బిజీగా ఉన్న ప్ర‌భాస్ కు ఉమైర్ సంధు కొత్త త‌ల‌నొప్పిని తీసుకువ‌చ్చిపెట్టాడు. ఈ వార్త‌ల‌తో ప్ర‌భాస్ ను ఎక్క‌డ‌కు వెళ్లినా కృతిస‌న్ తో పెళ్లి ఎప్పుడు అనే వార్తలే వెంటాడుతున్నాయి.

also read: సమంత-నాగచైతన్య బంధాన్ని విడగొట్టింది వారేనా..?

Visitors Are Also Reading