మహేష్ బాబు వరుసగా ప్లాప్‌లతో ఉన్నాడు. ఖలేజా సినిమా సమయంలో శ్రీనువైట్ల మంజుల సాయంతో మహేష్‌తో ఓ మీటింగ్‌లో పాల్గొన్నాడు. మహేష్‌బాబుతో సమావేశమైన తరువాత మహేష్ సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలుత మహేష్‌బాబుతో ఓ పీరియాడికల్ మూవీ చేద్దామని సిద్ధమయ్యాడు శ్రీనువైట్ల. తన ఆస్థాన రచయిత గోపి మోహన్‌తో కూర్చుని రకరకాల స్కెచ్‌లు వేయించాడు. కొత్త కాన్సెప్ట్‌లు ఆలోచిస్తున్నాడు. ఈ తరుణంలో పీరియాడికల్ ఆలోచన వచ్చింది.
ఓ రోజు కే.రాఘవేంద్రరావు ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా శ్రీనువైట్ల ఆఫీస్‌కు వచ్చాడు రచయిత గోపి మోహన్. జే కే భారవి రాఘవేంద్రరావుకు రావణ బ్రహ్మకథ చెబుతుంటే వండర్ అయిపోయానని చెప్పాడు. అప్పటికే ఖలేజా బాగా డీలే అవుతుంది. ఈ సమయంలో ఎఫిక్ మూవీ చేయాలనుకోవడం మంచిది కాదు. ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా చేయమన్నారు. ఇక్కడ పెద్ద ఛేంజ్ చేశాం. నిర్మాత మంజుల స్థానంలో 14 రీల్స్ వాళ్లు అయినటువంటి రామ్, గోపిచంద్ అచంట, అనీల్ సుంకరలు. వీరు శ్రీనువైట్లకు బెస్ట్ ఫ్రెండ్స్. వీరితో కలిసి నమో వెంకటేశ సినిమా ప్రొడక్షన్తో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే శ్రీనువైట్ల సినిమా విడుదల అయి 75 రోజులు గడిచాయి. అలాంటి సమయంలో గోపిమోహన్ ఓ కాన్సెప్స్ చెప్పాడు. ఆ కాన్సెప్ట్ శ్రీనువైట్లకు నచ్చింది. మహేష్‌కు కూడా ఓకే.
Advertisement
రెండు వారాలు డిస్కర్షన్ మీద డిస్కర్షన్ 80 శాతం సూపర్‌గా వచ్చింది. లాస్ట్ 20 శాతం ఎపిసోడ్ ఎంతకు తెగడం లేదు. మహాబలేశ్వరంలోని శివాలయం లోకి వెళ్లాడు. చాలా సేపు దేవాలయంలో ఒంటరిగా కూర్చున్నాడు. కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఆలోపు ఖలేజా సినిమా షూటింగ్ అయిపోతుంది. ఓ రోజు కేబీఆర్ పార్కులో శ్రీనువైట్ల వాకింగ్ చేస్తుండగా.. ఓ ఆలోచన తట్టింది. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధన్‌రెడ్డి . ఆయన అంతిమ యాత్రకు లక్షల్లో జనాలు వచ్చారని చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీను వైట్ల. ఏదైనా కాన్సెప్ట్ చెబుతున్నాడనుకుంటే పీజేఆర్ కాన్సెప్ట్ గురించి చెబుతున్నాడేంటి అని టీమ్ మెంబర్స్ అనుకున్నారు. కన్పూషన్ లేకుండా ఇదే మన కథ అని చెప్పాడు శ్రీనువైట్ల.
Advertisement
హీరో కూడా ఎమ్మెల్యేనే కానీ కాదు.. రియాలిటీ షో మాదిరిగా నడవాలని కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఆ టీమ్‌లో ఒకతను ఒక్కసారిగా విజిల్ ఇచ్చాడు. తెల్లారే లోపు ఆ స్టోరీ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశారు. మహేష్‌కు ఫర్‌పెక్ట్ మ్యాచ్‌తో మంజుల సపోర్ట్‌తో సమంత సెకండ్ సినిమా అగ్రిమెంట్ తీసేసుకున్నారు. ఆమెకు కూడా ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక ఫైనల్‌గా హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒక్కటే బ్యాలెన్స్. చాలా మందిని అనుకుంటున్నారు కానీ ఎవరూ సెట్ కావడం లేదు. మహేష్ ప్రకాశ్ రాజ్ అని ఓ సజీషన్ ఇచ్చారు. కథకు ఎంత టెన్షన్ పడ్డారో టైటిల్‌కు కూడా అంతే టెన్షన్ పడ్డారు.
Also Read : భీమ్లా నాయక్ విషయం లో ‘నిత్యా మీనన్’ ‘సంయుక్త మీనన్’ ఎందుకు హర్ట్ అయ్యారో తెలుసా ?
అప్పుడు దేవీశ్రీ ప్రసాద్ బిజీగా ఉండడంతో సంగీత దర్శకునిగా థమన్‌కు ఛాన్స్ ఇచ్చారు. తొలుత థమన్ రెండు పాటలు చేసుకొచ్చాడు. నా దూకుడు, గురువారం మార్చి 1 దీంతో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. ముఖ్యమైన ఎపిసోడ్‌కు మాత్రం ఎవ్వరూ వెళ్లని ఫారెస్ట్ లొకేషన్‌కు వెళ్లాలని ప్లాన్. ఇస్తాంబుల్ బ్యూటిపుల్ సిటీ.. కానీ ట్రాఫిక్ ఎక్కువ. షూటింగ్ చేయడం కష్టమైనా ఫస్ట్ స్కెడ్యూల్ అక్కడే చేశారు. మరొక వైపు మహేష్ తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమా చేయాలి. త్రీ ఇడియట్స్ మూవీ రీమెక్. దూకుడు కోసం మహేస్ ఆ సినిమాను వదులుకున్నారు.
మొత్తం 150 రోజుల్లో టాలీ పార్ట్ తీసింది 50 రోజులే. మిగతా 100 రోజుల్లో ఫైట్స్, సాంగ్స్‌కే పట్టింది. ఈ సినిమా లెంత్ ఎక్కువ కావడంతో 20 నిమిషాల సినిమా ఎడిట్ చేసి పక్కన పడేశారు. అయినా 3 గంటలు ఉంది. శ్రీనువైట్ల ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కళ్లు ఉన్న వాడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇక్కడ శ్రీను వైట్లకు దిమాక్ ఉందనే చెప్పాలి. తెలివైన మంచి కథ, మహేష్ లాంటి సూపర్ హీరో దొరికాడు. 2011 సెప్టెంబర్ 23న దూకుడు విడుదల అయింది. మార్నింగ్ షో చూసి సూపర్ స్టార్ కృష్ణ ఇది రూ.80 కోట్ల సినిమా అన్నారు. ఆయన చెప్పిందే నిజమైంది. మహేష్‌తో బ్లాక్ బస్టర్ తీయాలని శ్రీనువైట్ల మనసులో ఫిక్స్ అయ్యాడు. అందుకే దూకుడు బాక్స్ ఆఫీస్‌లో బ్లైండ్‌గా దూసుకుపోయింది.
Also Read : వరుణ్ తేజ్ ‘గని’ విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?