దేశంలో రోజురోజుకు గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. తెలిసో తెలియకనో అనేక తప్పులు చేసి చివరికి కటకటాలపాలవు తున్నారు.. చదువు లేని వారు అంటే ఏదో తెలియదు అనుకోవచ్చు. అయితే చదువుకున్నవారు ఇలాంటి కేసుల్లో ఉంటున్నారు. తాజాగా ప్రముఖ స్వీట్ షాప్ యజమాని పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డి ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతని భార్య ప్రజ్ఞ రెడ్డి ఆయన పై సంచలన ఆరోపణలు చేసింది. ఏక్నాథ్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తను ఇంట్లో నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. వివాహ సమయంలో భారీగా కట్నం ఇచ్చిన ఇంకా వేధిస్తూనే ఉన్నారని, తన ఇంట్లో బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఏక్ నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞ రెడ్డి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే గత కొంత కాలంగా ఏక్నాథ్ రెడ్డి మరియు అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో పోలీసులు అతనిపై గృహహింస కేసు నమోదు చేశారు. అయితే తన ఇంట్లో ఒక రూమ్ లో ఉంచి బంధించాలని, నేను బయటకు రాకుండా రాత్రికి రాత్రి అడ్డంగా గోడ కట్టారని ఏక్ నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞ రెడ్డి కంప్లైంట్ లో రాసి ఇచ్చారు. దీంతో పోలీసులు ఏక్నాథ్ రెడ్డిపై గృహ హింస చట్టాల కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
Advertisement
ALSO READ;
Advertisement
మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని మిలియన్ డాలర్లో తెలుసా…ఒక్క విల్లాకే…!
బంగారం తాకట్టు పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!