Home » ప్రభాస్ కు అనారోగ్యం…ఆ సినిమాల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్…?

ప్రభాస్ కు అనారోగ్యం…ఆ సినిమాల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్…?

by AJAY
Ad

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అయితే బాహుబలి తరవాత భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Advertisement

ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం వరకూ పూర్తయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా ను కూడా పూర్తి చేశాడు. రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమా తో పాటు ప్రభాస్ నాగ్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా మారుతి దర్శకత్వం లో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ప్రభాస్ అనారోగ్యం కారణం గానే షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం. జ్వరం తో బాధపడుతున్న ప్రభాస్ కొంత కాలం పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట.

Also read : వెంకటేష్, రాజేంద్రప్రసాద్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. కారణమేంటి?

Visitors Are Also Reading