Home » పెళ్లి ఫోటోలను బయట పెట్టిన పూర్ణ.. సోషల్ మీడియా లో వైరల్

పెళ్లి ఫోటోలను బయట పెట్టిన పూర్ణ.. సోషల్ మీడియా లో వైరల్

by Anji
Ad

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నటించి అలరించిన పూర్ణ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లలో నటిస్తూ అలరిస్తుంది. కెరీర్ పరంగా ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది పూర్ణ. ఓ మోస్తారు నుంచి చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తుంది. సౌత్ లో చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా తెలుగులో అఖండ, దృశ్యం 2 , తీస్ మార్ ఖాన్ చిత్రాలతో మెప్పించింది. సినిమాలతో పాటు ఢీ వంటి షోకి జడ్జ్ గా చేస్తుంది పూర్ణ. దీపావళి సందర్భంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది పూర్ణ.

Advertisement

ఈ భామ ఆ మధ్య దుబాయ్ బెస్ట్ ఇండియన్ వ్యాపారవేత్త షానిధ్ ఆసిఫ్ అలీనీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫోటోలు పంచుకొని సర్ ప్రైజ్ తో కూడిన షాక్ ఇచ్చింది మే నెలలో పూర్ణ ఎంగేజ్మెంట్ జరగాక కాబోయే వరుడుతో దిగిన కొన్ని ఫోటోలను కొన్నింటిని షేర్ చేసింది. అలా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక నవంబర్ లో పూర్ణ వివాహం ఉంటుందనే వార్తలు బాగా వైరల్ గా మారాయి. ఇటీవల ఒక మీడియాలో స్పందించిన పూర్ణ జూన్ 12 తేదీన తమ వివాహం జరిగిందంటూ ట్విస్ట్ ఇచ్చింది పూర్ణ.

Advertisement

Also Read :  ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కి బ‌య్య‌ర్స్ బ్లాక్ మెయిల్‌..  వార్నింగ్ ఇచ్చిన పూరి..!

పలు సమస్యల వలన అందరూ దుబాయ్ రాలేకపోయారు అని పూర్ణ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అలరించే ప్రయత్నం చేసింది. పూర్ణ పెళ్లి ఫోటోలు విషయానికి వస్తే పట్టుచీరలో నిండా నగలతో బుట్ట బొమ్మల కనిపిస్తోంది. పెళ్లికూతురు దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది. తన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అసూయ పుట్టేలా తన అందంతో పూర్ణ అక్కడ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లుగా ఈ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతుంది. త్వరలో కేరళలో పూర్ణ తన రిసెప్షన్ జరుపుకోనుందని ఈ కార్యక్రమానికి ఎవరెవరిని పిలుస్తుందో చూడాలి.

Also Read :  రష్మిక మందన్నని ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా ?

Visitors Are Also Reading