పూనమ్ పాండే 32 ఏళ్ళ వయసులో సర్వైకల్ క్యాన్సర్ తో పోరాడి మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ప్రకటించగానే ఫ్యాన్స్ అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి? సెలబ్రెటీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థిి ఏంటి? అని చాలా మంది భయపడ్డారు. మరి అసలు ఈ టైప్ క్యాన్సర్ ఏంటి? దీనికి నివారణ ఉందా? ఉంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సర్వైకల్ క్యాన్సర్‌నే గర్భాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. తాజాగా పూనమ్ పాండే కూడా ఈ క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ చివరి దశలో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ చెప్పారు. దేశంలోని మహిళలకి ఎక్కువగా సోకే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. ఎక్కువమంది భాగస్వాములతో లైం**గి**క చర్యలో పాల్గొనడం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. HPV వైరస్‌ని అరికట్టే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ని నివారించొచ్చు. మన దేశంలో కూడా ఈ క్యాన్సర్‌కి సొంత వ్యాక్సిన్ ఉంది. ‘సెర్వావాక్’ పేరుతో ఉన్న ఈ టీకాను 9-14 ఏళ్ల వయసున్న బాలికలకి ఖచ్చితంగా ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్‌ని నివారించొచ్చు.
Advertisement
అయితే ప్రస్తుతం 9-26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. ఒక్కో డోసు రూ.2,000లు పడుతుంది. వ్యాక్సిన్ తీసుకునే వారి వయసును బట్టి రెండు లేదా మూడు డోసులు సజెస్ట్ చేస్తారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్లో కూడా ఈ వ్యాక్సిన్ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు పూనమ్ పాండే ఈ క్యాన్సర్‌తో మృతి చెందడంతో ఇంకా ఎక్కువ మంది దీని గురించి తెలుసుకుంటున్నారు. ఒక వేళ పూనమ్ కూడా ముందే ఈ లక్షణాలను గుర్తించి టెస్ట్ చేసి వ్యాక్సిన్ తీసుకొని ఉంటే బతికుండేదేమో అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.