Home » పీకే అంటే కొత్త అర్ధం చెప్పిన పూనమ్ కౌర్…!

పీకే అంటే కొత్త అర్ధం చెప్పిన పూనమ్ కౌర్…!

by Azhar
Ad
మన టాలీవుడ్ లో సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ లో మొదటి స్థానంలో ఉంటుంది పూనమ్ కౌర్. హీరోయిన్ గా వచ్చిన కొత్తలో వరుస సినిమాలో నటించిన పూనమ్ కౌర్ కు తర్వాత తన యాటిట్యూడ్ ద్వారా ఏకాకాశాలు రాలేదు. అలాగే తన పైన వచ్చిన వార్తలు కూడా అందుకు తోడయ్యాయి. అందువల్ల తెలుగు సినిమా అభిమానులకు తెరపైన దూరమైన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాత్రం ఎప్పుడు దగ్గరే ఉంది. అయితే పూనమ్ కు ఇక్కడ అవకాశాలు రాకపోవడానికి పవన్ కళ్యా కారణం అని చాలా వార్తలు వచ్చాయి.
అందుకే పూనమ్ కౌర్ ఎటువంటి పోస్ట్ పెట్టిన దాని కింద పవన్ కు సంబంధించిన ప్రశ్నలు చాలానే వస్తుంటాయి. అదే విధంగా పూనమ్ కౌర్ కాంట్రవర్సీ పైనే ఎక్కువగా పోస్ట్లు చేస్తూ ఉంటుంది. అయితే తాను ఏ పోస్ట్ చేసిన దాని చివర్లో #PKLOVE అని తప్పకుండ ఉంటుంది. అయితే ఇందులో PK అంటే ఏంటి పూనమ్ కౌర్… లేక పవన్ కళ్యాణ్ నా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. దాంతో ఓ అభిమాని నేరుగా ట్విటర్ లో పూనమ్ కౌర్ ను ఇదే ప్రశ్న అడిగారు.
అక్క మీరు చేసే పోస్ట్లు అన్ని ఓకే కానీ.. చివర్లో ఈ #PKLOVE అంటే అర్ధం ఏమిటి.. ఇందులో ఉన్న ఆ PK అంటే ఏంటి ప్రశ్నించాడు. దానికి ఎవరు హించని విధంగా సమాధానం ఇచ్చింది పూనమ్. ”మీరు నన్ను ఏ కారణం లేకుండానే సోషల్ మీడియాలో ట్రోల్, టీజ్ చేస్తూ ఉంటారు కదా.. అయిన కూడా నేను అవి పట్టించుకోకుండా ఇలానే చేస్తుంటాను అని అర్ధం. ఇప్పుడు నీకు అర్ధం అయ్యిందా తమ్ముడు”  అని పోస్ట్ సమాధానం ఇచ్చింది పూనమ్. ఇక ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయని పూనమ్ తెలుగులో కూడా అభిమానులకు కనిపించి చాలా రోజులు అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading