తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన పూజా హెగ్డే కు 2022 వ సంవత్సరం అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆచార్య, రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అంతేకాకుండా కోలీవుడ్ మూవీ అయిన బీస్ట్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు వరుస విజయాలతో దూసుకెళ్లిన పూజా హెగ్డే ఈ సంవత్సరంలో మాత్రం వరుస ప్లాపులే ఆమెకు ఎదురయ్యాయి.
Advertisement
also read;సామ్ కరణ్ పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో..!
దీనికి తోడు విజయ్ దేవరకొండ తో జనగణమన సినిమా చేస్తుంది అనుకుంటే అది మధ్యలో ఆగింది. అంతేకాకుండా పవన్ హరిష్ శంకర్ కాంబోలో వచ్చే భవదీయుడు భగత్ సింగ్ మూవీ చాన్స్ కోల్పోయింది. ఈ రెండు సినిమాల వల్ల ఆమె దాదాపు 10 కోట్ల వరకు నష్టపోయిందని చెప్పవచ్చు. ఇన్ని ప్లాపులు వచ్చినా పూజా హెగ్డే మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదెలా అంటుందట .. ఇంకా పెంచాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఈ విధంగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుందని పలువురు అంటున్నారు.
Advertisement
ఇక ఈ విషయం ఆ నోట ఈ నోటా పూజ హెగ్డే వరకు చేరింది. దీంతో ఆమె మాట్లాడుతూ నేను నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాను అని వచ్చే వార్తలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించింది. నాకు పాత్రలే ముఖ్యం డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను. కథ,పాత్ర నచ్చితే మాత్రమే చేస్తానని తెలియజేసింది. పారితోషికానికి ప్రాధాన్యత ఇస్తే నా చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉండేవని చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా తనకు డబ్బు పిచ్చి అస్సలు లేదని చెప్పకనే చెప్పింది పూజ హెగ్డే..
also read;