Home » బాడీ షేప్ కోసం కష్టపడుతున్న బుట్ట బొమ్మ…వర్కౌట్ చూస్తే చెమటలు పట్టాల్సిందే…!

బాడీ షేప్ కోసం కష్టపడుతున్న బుట్ట బొమ్మ…వర్కౌట్ చూస్తే చెమటలు పట్టాల్సిందే…!

by AJAY

Ad

ఒకప్పుడు హీరోయిన్లు అంటే ముద్దుగా బొద్దుగా కనిపించే వారు. కానీ ఇప్పుడు అంతా సైజ్ జీరో కాలం నడుస్తోంది. సినిమా హీరోయిన్ల నుండి సీరియల్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరూ సైజ్ జీరో ను మెయింటైన్ చేస్తున్నారు. జీరో సైజ్ మెయింటెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మార్చుకోవడం తో పాటు గంటల తరబడి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కెరీర్ కోసం హీరోయిన్లు ఎంతో కష్టపడి వ్యాయామం చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ వ్యాయామం చేసే హీరోయిన్ల‌లో స‌మంత‌, ర‌ష్మిక ముందు వ‌రుస‌లో ఉంటారు.

pooja hedge workout

pooja hedge workout

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో ఒకరైన‌ పూజా హెగ్డే కూడా జిమ్ లో ఎంతో క‌ష్ట‌ప‌డుతోంది. అల వైకుంఠపురం సినిమాతో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం పూజా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రాధే శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలలో పూజా నటించగా ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక మిగతా హీరోయిన్ల మాదిరిగానే బుట్ట బొమ్మ కూడా ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది.

Advertisement

Advertisement

also read : టికెట్ ధరలపై ఆర్జీవీ అన్ని ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం ఇచ్చిన దాసరి..!

గంటల తరబడి జిమ్ లో గడుపుతూ చెమటలు కారుస్తుంది. అంతేకాకుండా తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లకు కూడా చెమటలు పట్టిస్తుంది. తాజాగా పూజా తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో పూజా కు చెమటలు పట్టడం ఏమో గాని వీడియో చూస్తున్న వారికి సైతం చెమటలు పట్టే విధంగా హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. వీడియోలో రెడ్ క‌ల‌ర్ స్పోర్ట్స్ వేర్ లో కోచ్ ఎలా చెబితే పూజా అలా చేస్తోంది.

https://www.instagram.com/reel/CYbCHMhA3S4/?utm_medium=copy_link

Visitors Are Also Reading