Home » టికెట్ ధరలపై ఆర్జీవీ అన్ని ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం ఇచ్చిన దాసరి..!

టికెట్ ధరలపై ఆర్జీవీ అన్ని ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం ఇచ్చిన దాసరి..!

by AJAY
Ad

ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలని పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ వరుస ట్వీట్ లతో ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల ధరలపై ప్రశ్నిస్తున్నారు. సినిమా టిక్కెట్ల ధరల పై ప్రభుత్వ నియంత్రణ విధించడం ఏంటని రాంగోపాల్ వర్మ ఏపీ మంత్రులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ల అంశంపై చర్చించేందుకు ఈ నెల పదవ తారీఖున రాంగోపాల్ వర్మకు ఏపీ మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.

Rgv dasari narayana rao

Rgv dasari narayana rao

ఇదిలా ఉంటే నిర్మాతలకు లాభాలు రావాలని ఉంటే.. ప్రేక్షకులు సినిమాలు చూడాలని ఉంటే కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించాలని ఏపీ సర్కార్ సలహా ఇస్తోంది. అయితే ఆర్జీవి దీనిని ఖండిస్తున్నారు. హీరోల ముఖాలు చూసే సినిమాలకు వస్తారని టికెట్ రేటు ఎంత ఉండాలో ప్రభుత్వం నియంత్రించడం తప్పు అంటున్నారు. అయితే ఇదే అంశంపై దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఒకప్పుడు ఓ ఇంటర్వ్యూలో స్పందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement

Also read : ఆర్ఆర్ఆర్ వాయిదాతో రాజ‌మౌళిపై ఎన్నికోట్ల భారం ప‌డిందో తెలుసా..?

ఈ వీడియోలో దాసరి మాట్లాడుతూ… ఒకప్పుడు సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పక్కాగా టాక్స్ విధించేదని ధరలు తక్కువగా ఉండేవని అన్నారు. అయినప్పటికీ సినిమాలకు లాభాలు వచ్చాయని అన్నారు. హీరోల రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాలని దాసరి భావించారు. ఇదంతా కాస్ట్ ఫెయిల్యూర్ అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రూపాయల టిక్కెట్టు వెయ్యి రూపాయలు… 50 రూపాయల టిక్కెట్టు 2000 కు అమ్ముతుంటే ప్రభుత్వం, ఎంఆర్వో ,మీడియా ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు.

Visitors Are Also Reading