భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. గత కొద్ది రోజులుగా ప్రధాని తల్లి హీరాబెన్ (100) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హీరాబెన్ ని బుధవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ లోని యూ.ఎన్.మెహతా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 30న ఆమె తుదిశ్వాస విడిచారు.
Advertisement
ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ గాంధీనగర్ శివారులోని రైసన్ అనే గ్రామంలో తమ్ముడు పంకజ్ మోడీతో కలిసి నివసిస్తున్నారు. మోడీకి, తల్లి హీరాబెన్ కి మధ్య ప్రత్యేక అనుబంధమే ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తల్లి హీరాబెన్ ఉన్నదని పలు సందర్భాల్లో ప్రధాని చెబుతుండేవారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకునేవారు. డిసెంబర్ లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ను కలిశారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
Advertisement
— Narendra Modi (@narendramodi) December 30, 2022
గుజరాత్ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 04 న గాంధీనగర్ లో ప్రధాని తల్లిని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొని.. ఆమెతో కూర్చొని టీ తాగారు. గుజరాత్ ఎన్నికలకు ముందు జూన్ 18న తన 100వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ తన తల్లిని కలిసారు. ప్రధాని అంతకు ముందు మార్చి 11, 12 తేదీలలో రెండు రోజుల పర్యటనలో ఉన్నప్పుడు మార్చి 11న రాత్రి 9 గంటలకు తల్లి హీరాబెన్ ని కలవడానికి గాంధీనగర్ కి చేరుకున్నారు. అప్పుడు ప్రధాని తల్లితో కలిసి కిచ్చీలు తిన్నారు. తాజాగా తల్లి మరణంతో భావోద్వేగంతో.. “నిండు నూరేళ్లు పూర్తి చేసుకొని ఈశ్వరుడి చెంతకు చేరింది, అమ్మ నిస్వార్థానికి చిహ్నం” అంటూ ట్వీట్ చేశారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read : చలికాలంలో బట్టలు ఆరేసినా తేమపోదు.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే ఫలితం పక్కా..!