Home » పీఎం కిసాన్ డ‌బ్బులు వ‌చ్చేస్తున్నాయి .. కానీ రూల్స్ మారిన విష‌యం మీకు తెలుసా..?

పీఎం కిసాన్ డ‌బ్బులు వ‌చ్చేస్తున్నాయి .. కానీ రూల్స్ మారిన విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ad

కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రంలో ప్ర‌తి నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తున్న విష‌యం విధిత‌మే. పీఎం కిసాన్ ప‌థ‌కం ద్వారా రైతుల‌కు వ్య‌వ‌సాయ ఖ‌ర్చుల కోసం ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 11 విడత‌ల న‌గ‌దును కేంద్రం రైతుల‌కు అందించింది. ఇప్పుడు ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్ నెల‌లో 12వ విడుత న‌గ‌దు రైతుల ఖాతాల్లో జ‌మ కానుంది. అయితే ఈసారి పీఎం కిసాన్ స్కీమ్ రూల్స్ మారాయి. ఇక కొత్త రూల్స్ ప్ర‌కారం.. రైతులు ఆధార్ కార్డు నెంబ‌ర్ ద్వారా మీ స్టేట‌స్ ని చెక్ చేయ‌లేరు. కొత్త రూల్ ప్ర‌కార‌మే రైతులు వారి స్టేట‌స్ చెక్ చేసుకోవాలి.


మారిన నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రైతులు డ‌బ్బులు పొందాల‌నుకుంటే వారి మొబైల్ నెంబ‌ర్, రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ అవ‌స‌రం. వీటి ద్వారా స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు కిసాన్ పోర్ట‌ల్ కి లాగిన్ అయి ఆధార్ నెంబ‌ర్, మొబైల్ నెంబ‌ర్ లేదా బ్యాంకు ఖాతా నెంబ‌ర్ ద్వారా న‌మోదు చేసేవారు. గ‌తంలో మొబైల్ నెంబ‌ర్ సౌక‌ర్యం నిలిపివేశారు. ఆధార్, బ్యాంకు నెంబ‌ర్ ద్వారానే స్టేట‌స్ చెక్ చేయ‌వ‌చ్చు. ఇప్పుడు ఆధార్, బ్యాంకు నెంబ‌ర్ కాకుండా మొబైల్ నెంబ‌ర్, రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ ద్వారా మాత్ర‌మే స్టేట‌స్ చెక్ చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Advertisement


తొలుత పీఎం కిసాన్ వెబ్‌సైట్ లాగిన్ కావాలి. ఆ త‌రువాత బెనిఫిషియ‌రీ స్టేట‌స్ పై క్లిక్ చేయాలి. ఆ త‌రువాత న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. తరువాత మీ స్టేట‌స్ తెలుస్తోంది. మీ మొబైల్ ద్వారా స్టేట‌స్ చెక్ చేయాల‌నుకుంటే మొబైల్ నెంబ‌ర్ సెర్చ్ ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి. ఆ త‌రువాత ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నెంబ‌ర్ ని ఎంట‌ర్ చేయాలి. ఇక ఆ త‌రువాత ఓటీపీ నెంబ‌ర్, క్యాప్చాకోడ్ ఎంట‌ర్ చేసి డేటా పై క్లిక్ చేస్తే అప్పుడు స్టేట‌స్ వ‌స్తుంది.

Also Read : 

మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మీ.. ఆ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త‌..!

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘ‌న విజ‌యం.. తొలి ఆదివాసీ మ‌హిళగా రికార్డు..!

Visitors Are Also Reading