ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్టు ఎల్ఐఓసీ ప్రకటించినది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్టు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254 కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది.
Advertisement
Advertisement
మరొక శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ తరుణంలోనే రేట్లు పెంచాల్సి వచ్చిందని ఎల్ఐఓసీ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.57 తగ్గింది. శ్రీలంక రూపాయి పడిపోవడం గత వారం రోజుల్లో ఇది రెండవ సారి. మరొక వైపు నెల రోజుల వ్యవధిలో శ్రీలంకలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడవ సారి. శ్రీలంక ప్రభుత్వం చమురు ధరలపై ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని.. తద్వారా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సంస్థ నష్టపోతుందని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్త వివరణ ఇచ్చారు.