సైకిల్ తొక్కుతూ గ్రామాలలో పల్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినది. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్కు చెందిన భూబన్ అనే పల్లీల వ్యాపారి కడు పేదవాడు. కనీసం కాళ్లకు చెప్పులు లేని ఆయన రోజు మాదిరిగానే పల్లీలు అమ్ముకుంటూ వెళ్తూ శనక్కాయల మీద ఓ పాట పాడాడు. అతను పాడిన విధానం నెటిజన్లను ఆకట్టుకుందట.
Advertisement
బాదామ్ బాద్ కచ్చా బాద్ అంటూ సాగే ఈ పాటతో జనం తన పల్లీలు కొనుక్కునేలా చేస్తుంటాడు భూబన్. పాట విన్న ప్రజలు ఆయన టాలెంట్‌కు ముచ్చటపడి ఆనందంతో పల్లీలు కొంటారు. ఇప్పుడు ఆ పాట తెగ వైరల్ అయింది. ఓ రకమైన రిథమిక్ ఉన్నదని నెటిజన్లు పేర్కొంటున్నారు.కొంతమంది ఈ పాటపై మాషప్స్ కూడా చేసారు. అవి కూడా వైరలవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గాయని రాణు మండల్ కూడా ఈ పాటను తనదైన శైలిలో పాడారు.
Advertisement
ఈపాట పాడిన భూబన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే తన పాటకు ఎంత పాపులారిటీ వచ్చినా దాని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు అని ఇతరులు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు అని కంప్లైట్‌లో చెప్పినట్టు తెలిసింది. స్వయంగా పాడినపాటను సోషల్ మీడియాలో కొంతమంది రీమిక్స్‌లు, ఇతర చేసి ఫేమ్ తెచ్చుకుంటారు. మరీ ఈ పాట పాడిన భూబన్‌కి మేలు చేయాలి కదా. అది మాత్రం జరగడం లేదు. ఒక్క రూపాయి కూడా అతనికి చేరడం లేదట. తమపై కేసులు పెడితే ఊరుకునేది లేదు అని కొంతమంది వార్నింగ్ కూడా ఇస్తున్నారని భూబన్ ఆవేదనను వ్యక్త పరిచాడు.