పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోవైపు.. ఈ హీరో చాలా డిఫరెంట్ థింకింగ్ తో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించాడు. ఎలాగైనా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కసరత్తులు చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన తన రాజకీయ జీవితం గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు..
Advertisement
also read:ఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాపని గుర్తించారా.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది..!!
హైదరాబాదులోని సీఏ విద్యార్థుల సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు.. నేను ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకున్నీ, నా రాజకీయ జీవితంలో విఫలమయ్యానని అన్నారు. దీంతో అక్కడున్న విద్యార్థులంతా ఒక్కసారిగా నో నో అంటూ గట్టిగా అరిచారు.. మీరు కాబోయే సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు.. అపజయం ఏ విధంగా తాత్కాలికమైనదో విజయం కూడా తాత్కాలికమే అన్నారు.. విజయాన్ని నెత్తికెక్కించుకోకూడదని విద్యార్థులకు సూచనలు చేశారు.
Advertisement
నా రాజకీయ జీవితంలో నేను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ని అని ఒప్పుకున్నాను. దాన్ని నేను అంగీకరిస్తున్నాను, అలా అని నేను బాధపడుతూ కూర్చొని, నా ఓటమే నా విజయానికి సగం బాట వేస్తుందన్నారు. వైఫల్యాలు సాధించినప్పుడే సానుకూల దృక్పథంతో చూస్తానని సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలామంది ఏం చేయకుండా ఉంటున్నారని, నేను అలా కాదని నా ప్రాణం పోయే వరకు సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తానని చివరకు సాధిస్తానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న అక్కడి విద్యార్థులంతా ఒక్కసారిగా నినాదాలు చేస్తూ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ హోరెత్తించారు.
also read: