pawan kalyan wife anna lezhneva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.. ఆయన సినిమా నుంచి మొదలు రాజకీయం వరకు చాలా డిఫరెంట్ థింకింగ్ తో ముందుకు వెళుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. తనదైన స్టైల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవర్ స్టార్ పవన్ మూడవ భార్య అన్నా లెజ్నోవా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా రష్యా దేశానికి చెందిన మహిళ.
Advertisement
ALSO READ;సౌందర్య వెంకటేష్ ల మధ్య అలాంటి రిలేషన్షిప్ ఉండేదా..? వెంకటేష్ ను ఏమని పిలిచేవారంటే..?
అన్నా లెజ్నోవా గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేసిందట. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి 2011లో తీన్ మార్ సినిమా చిత్రీకరణ టైంలో ఆమె పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కలిశారని, దీంతో వీరి మధ్య లవ్ పుట్టిందని తెలుస్తోంది. ఈ విధంగా కొన్నాళ్లు డేటింగ్ కూడా చేసి తర్వాత రెండో భార్య అయిన రేణు దేశాయ్ కి 2013లో విడాకులు ఇచ్చిన తర్వాత అన్నా లెజ్నోవా ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లెజ్నోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోయి భారతీయ మహిళగా మారింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సమయంలో ఆమె సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. నుదుట బొట్టు పట్టుచీర కట్టుకొని అచ్చం తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది అని చెప్పవచ్చు.
Advertisement
భారతీయ సంప్రదాయాలు పెద్దగా తెలియక పోయినప్పటికీ అప్పట్లో అన్నా లెజ్నోవా పవన్ కు హారతి పడుతూ ఆయన కారుకు కొబ్బరికాయ కొట్టి మన తెలుగు సంప్రదాయాన్ని ఎంతో గౌరవిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో పెద్ద సెలబ్రిటీ కానీ అన్నా లెజ్నోవా మాత్రం చాలా సాదాసీదాగా పెద్దపెద్ద ప్రగల్బాలకు పోకుండా నడుచుకుంటుందట. ముఖ్యంగా తన కుటుంబానికి సేవ చేస్తూ కేవలం భర్తే సర్వస్వంగా బతుకుతూ ముందుకు వెళుతుందని తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో నాగబాబు కూడా రేణు దేశాయ్ కంటే అన్నా లెజ్నోవా మా కుటుంబంతో బాగా కలిసిపోయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నా లెజ్నోవా అంటే మెగా కుటుంబంలో అందరికీ చాలా ఇష్టమట. దీనికి ప్రధాన కారణం ఆమె కుటుంబ సభ్యులందరితో నడుచుకునే తీరు అని చెప్పొచ్చు.
ALSO READ;Uday Kiran: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్ అందులో ఏముందంటే ?