Home » పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.. కారణం అదేనా..?

పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.. కారణం అదేనా..?

by Anji
Published: Last Updated on
Ad

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అస్వస్థతకు గురవ్వడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వరుసగా సినిమా షూటింగులు, రాజకీయ సభలు, సమావేశాలతో బిజీగా ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. 

Advertisement

పవర్ స్టార్ అస్వస్థతకు గురి కావడంతో ప్రారంభం అవ్వాల్సిన తమిళ చిత్రం వినోదయ్యా సీతం రీమేక్ షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం కోసం పవన్ ప్రత్యేక డైట్ తీసుకున్నట్టు సమాచారం. స్లిమ్ గా కావాల్సి ఉండడంతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు ఫిలిం వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించకపోవడంతోనే తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వెళ్లలేదని పేర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ని రద్దు చేసుకున్నట్టు సమాచారం.

Also Read :  చిరంజీవితో చెప్పులు మోయించిన ఆ స్టార్ నటి ఎవరో తెలుసా..?

Advertisement

Manam News

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. జనవరి నెల వరకు హరి హర వీరమల్లు షూటింగ్ లోనే పాల్గొన్నాడు. ఆ సినిమా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. వినోదయ సీతం రీమేక్ కి డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్. మరోవైపు సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో వచ్చే నెల నుంచి జనసేనాని చేపట్టాలని అనుకున్న వారాహియాత్ర కూడా కాస్త వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. వీలైనంత త్వరలో ఎన్నికల్లో కదనరంగంలోకి దూకాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని తెలియగానే అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. 

Also Read :  ఇక నుంచి ఫోన్ కొట్టు.. గిప్ట్ పట్టు..!

Visitors Are Also Reading