పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది హిట్ సినిమాలు వచ్చిన విషయం విధితమే. వీరి కాంబినేషన్ భారీ అంచనాలతో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. సినిమా పరంగా ఫెయిల్ అయినప్పటికీ బిజినెస్ పరంగా మాత్రం బాహుబలికి కూడా సవాల్ చేసే బిజినెస్ జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో అప్పటివరకు మరే సినిమా కూడా రానంతగా హైప్ .. పైగా పండుగ సీజన్.. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినిమా అంటే ఇక రేంజ్ ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే అన్నీ ఉన్నాకానీ.. ఈ సినిమాలో మాత్రం కథలేదు.. కథనం లేదు.. పర్‌ఫెక్ట్ స్క్రీన్ ప్లే లేదు. దీంతో ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. పైగా ప్లాపుల్లో ఆల్‌టైమ్ రికార్డులు సెట్ చేసింది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు గడిచింది. పవన్ కెరీర్‌లోనే త్రివిక్రమ్ కెరీర్‌లో కూడా ఎప్పటికీ మాయని మచ్చనే అజ్ఞాతవాసి. కలలో కూడా ఊహించని ప్లాప్ అంట ఇది. విడుదలకు ముందు ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయి ఉంటే.. విడుదల అయిన తరువాత అవి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి.
Advertisement
Advertisement
నష్టాల్లో ఈ చిత్రం టాలీవుడ్‌లో రెండవ పెద్ద డిజాస్టర్ ఇక్కడ మొదటిస్థానం మహేష్‌బాబు స్పైడర్ తీసుకున్నాడు. దాదాపు 60 కోట్లకు పైగా నష్టాలు తీసుకొస్తే, అజ్ఞాత వాసి 58 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది. డిజాస్టర్ టాక్‌తోనే రూ.57కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.98కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే సినిమా రేంజ్‌కు ఇది సరిపోదు. నాన్ బాహుబలి కేటగిరీలో అప్పటి వరకు ఏ తెలుగు సినిమా చేయని బిజినెస్ చేసింది ఈ చిత్రం. సౌత్‌లో రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన మూడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. దీనికి ముందు స్పెడర్.. మెర్సర్ ఉన్నాయి. 120కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు అని ప్రశ్నించారు అభిమానులు.
పవన్‌కల్యాణ్ 25వ సినిమా కదా అని కోట్లాది ఆశలతో వచ్చిన అభిమానుల ఆశలపై నిండా నీళ్లు పోసాడు. ఏమి చేసినా చూస్తారు లే అనే అతి విశ్వాసమే అజ్క్షాతవాసి కొంప ముంచేసిందని అప్పట్లో గగ్గోలు పెట్టారు విశ్లేషకులు. ఈ పాపం ఎవరిది అయినా కానీ అప్పుడు మునిగింది మాత్రం బయ్యర్లు. ఈ చిత్రం ఫైనల్ రన్ రూ.57 కోట్ల దగ్గరే ఆగిపోయిందట. సీడెడ్ 5.30 కోట్లు, ఉత్తరాంద్ర 5.40 కోట్లు, ఈస్ట్ 4.25 కోట్లు, వెస్ట్ 4.75 కోట్లు, గుంటూరు 5.15 కోట్లు, కృష్ణా 3.35 కోట్లు, నెల్లూరు 2.25 కోట్లు, ఏపీ-తెలంగాణ మొత్తం 40.90 కోట్లు, ఓవర్సిస్ 7.20 కోట్లు, రెస్టాప్ ఇండియా 1.15 కోట్లు, కర్ణాటక 6.35 కోట్లు కాగా.. బిజినెస్ మొత్తం 125 కోట్లు అయితే ప్రపంచవ్యాప్తంగా 57.50 కోట్లు షేర్ వసూలు చేసింది.