అన్నా మల్లోచ్చినా.. అన్నా రైతు బిడ్డనన్నా.. నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండన్నా అంటూ ఎట్టకేలకు హౌజ్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. కామన్ మెన్ గా హౌజ్లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అవతరించాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే అస్సలు చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌజ్లోకి వచ్చినప్పుడు కూడా ‘ఇలాంటి వాళ్లని చాలామందిని చూశాం.. హౌజ్లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం’ అని అనుకున్న వాళ్లే ఎక్కువ.
Advertisement
వారందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పు అని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. హౌజ్లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు పల్లవి ప్రశాంత్. ‘రైతు బిడ్డ’ అనే ట్యాగ్ కొంచెం అతనిపై సెంటిమెంట్ ను క్రియేట్ చేసినప్పటికీ హౌజ్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్, టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. రతికా రోజ్ లాంటి కంటెస్టెంట్స్ ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టినా వారిని పెద్ద మనసుతో క్షమించాడే తప్ప పగలు, ప్రతీకారాలకు పోలేదు. అలాగే చాలామంది కంటెస్టెంట్స్ తక్కువగా చూసినా, పరుషపు మాటలతో తన మనసును గాయపరిచినా తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు. అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించాడు.
#PallaviPrashanth is the Season 7 WINNER.
Congratulations 🔥👏👏#Amardeep ended as Runner-up. 👏👏#BiggBossTelugu7 #BiggBossTelugu7GrandFinale #BiggBoss7Telugu #Nagarjuna pic.twitter.com/4ZoIFpWBvI— BiggBossTelugu7 (@TeluguBigg) December 17, 2023
కేవలం హౌజ్లోనే కాదు బయట కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. తనకు అప్పటికే పెళ్లైందని, కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పీఆర్ టీమ్స్ నెగెటివ్ ప్రచారం చేసినా అవేవీ తన విజయాన్ని అపలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్లో రైతు బిడ్డకు తిరుగులేని మద్దతు లభించింది. అదే తనను విజేతగా నిలిపింది. రెండో స్థానంలో సీరియల్ నటుడు అమర్ దీప్ నిలవగా, మూడో స్థానంలో శివాజీ నిలిచాడు. నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో ప్లేస్లో అర్జున్ అంబటి నిలిచారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!