Home » అర్ష్‌దీప్‌ ఖలిస్తాని అంటూ పాక్ ప్రచారం..!

అర్ష్‌దీప్‌ ఖలిస్తాని అంటూ పాక్ ప్రచారం..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ యొక్క వేడి అనేది ఇంకా చల్లరలేదు అనే చెప్పాలి. చివరి ఓవర్ కు వచ్చిన ఈ మ్యాచ్ లో.. ఒక్క బంతి ఉండగా.. భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది పాకిస్థాన్. అయితే భారత్ ఓడిపోవడంలో మన యంగ్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్ డ్రాప్ చేసిన క్యాచ్ కూడా ముఖ్య పాత్ర పోషించింది అనే చెప్పాలి. అర్ష్‌దీప్‌ క్యాచ్ డ్రాప్ తర్వాత అతనిపై దారుణమైన ట్రోలింగ్స్ అనేవి వస్తున్నాయి.

Advertisement

అయితే ఇదే అసలుగా తీసుకున్న పాకిస్థాన్ కు చెందిన కొందరు అర్ష్‌దీప్‌ విషయంలో భారీ కుట్రకు తెర లేపారు. గూగుల్ లోని అర్ష్‌దీప్‌ వికీపీడియాలో అతను ఖలిస్తాని చెందిన క్రికెటర్ అని ఎడిట్ చేసారు. అతను ఖలిస్తాని జట్టు తరపున మొదట ఆడాడు అని.. అతని దేశం కూడా ఖలిస్తాని అంటూ అన్హులో మార్చేశారు. అయితే ఈ పని చేసింది పాకిస్థాన్ లోని పంజాబ్ కు చెందిన వ్యక్తులు.

Advertisement

ఈ విషయాన్ని ఇండియాకు చెందిన కొంతమంది ఐటీ నిపుణులు సాక్షాలతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అయితే ఈ విషయాన్ని భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ గా తీసుకుంది. మొదట ఆలా ఎడిట్ చేసే అవకాశం ఇచ్చిన వికీపీడియాకు నోటీసులు జారీ చేసారు. అలాగే అర్ష్‌దీప్‌ పై ట్రోలింగ్ కూడా పాకిస్థాన్ లోనే మొదలయింది అని తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్..!

Visitors Are Also Reading