సాధారణం ఎవరికీ అయినా బాడీ పెయిన్స్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఏ పని చేసినా.. దూరం ప్రయాణం చేసినా శరీరంలో నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి నొప్పులతో ఎలాంటి ప్రమాదముండదు. సహజంగా వచ్చే నొప్పులే ఉండవచ్చు. లేదా కొన్ని రకాల నొప్పులు మాత్రం చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా శరీరంలో కనిపించే కొన్ని నొప్పులు క్యాన్సర్ కి సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏయే ప్రాంతాల్లో వచ్చే నొప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
- నిరంతరం తలనొప్పి, స్ప హ కోల్పోవడం, చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోవడం, శక్తి తగ్గడం వంటివి వస్తే వెంటనే అలెర్ట్ గా ఉండాలి. ఇది బ్రెయిన్ ట్యూమర్ కి ముందస్తు సూచనలు కావచ్చని చెబుతున్నారు.
- ఛాతీలో విపరీతంగా నొప్పి ఉండడం, నిరంతర దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంకేతాలు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- రొమ్ము ప్రాంతంలో నొప్పి ఉండడం, ఆకారంలో మార్పు కనిపించడం వంటివి సంకేతం. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Also Read : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఎలాగంటే ?
Advertisement
- ఆహారం తీసుకున్న సమయంలో కడుపులో విపరీతమైన నొప్పి కలిగినా, ఉన్న ఫలంగా బరువు తగ్గడం, కడుపు ఉబ్బరం వంటివి స్టమక్ క్యాన్సర్ కి ప్రాథమిక లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.
- మల విసర్జన సమయంలో నొప్పిగా ఉండడం, మలంలో రక్తం రావడం, బరువు తగ్గడం వంటివి పెద్ద పేరు క్యాన్సర్ కి లక్షణాలు కావచ్చు. మూత్ర విసర్జన చేేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. మూత్రంలో రక్తం రావడం, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కి సూచిక కావొచ్చని చెబుతున్నారు.
Also Read : హరితేజ పై నెటిజన్ల ట్రోలింగ్స్.. అందుకోసమేనా ?