Home » OPERATION VALENTINE MOVIE REVIEW : ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

OPERATION VALENTINE MOVIE REVIEW : ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

by Anji
Ad

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత  విడుదలైన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. తెలుగులో రూపుదిద్దుకున్న తొలి ఏరియల్ యాక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. హిందీ, తెలుగులో ఏకకాలంలో నిర్మాణం జరుపుకొని రెండు చోట్లా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..? వరుణ్ తేజ్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడు..? వరుణ్ ఖాతాలో మరో హిట్ పడిందా..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సినిమా : ఆపరేషన్ వాలెంటైన్

నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు.

సినిమాటోగ్రఫీ : హి కె.వేదాంతం

సంగీతం : మిక్కీ జే యేయర్

ఎడిటింగ్ : నవీన్ నూలి

మాటలు : సాయి మాదవ్ బుర్రా

నిర్మాత : సోనీ పిక్చర్స్ సందీప్ ముద్ద

దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింత్

విడుదల : మార్చి 01, 2024

కథ మరియు విశ్లేషణ : 

అరుణ్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. ఏం జరిగినా చూసుకుందాం అంటూ ధైర్య సాహసాలతో అడుగు వేసే కరం. వైమానిక దళంలోనే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. ప్రాజెక్ట్ వజ్ర కోసం నడుం కట్టిన సమయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాని నుంచి కోలుకున్న తరుణంలో ఆయన ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆపరేషన్ వెనుక ఉన్న కథ ఏంటి..? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యం ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే.. ఈ సినిమాని థియేటర్లలో వీక్షించాల్సిందే.

Advertisement

ముఖ్యంగా భారత్-పాక్ మధ్య జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. 2019లో పుల్వామా దాడులు, దానికి ప్రతిదాడి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు పలు సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. రెండు దేశాల మధ్య పోరాటం, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు. పుల్వామా దాడి, ప్రతి దాడిగా ఆపరేషన్ వాలెంటైన్, ఆ తరువాత పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రు దానిని తిప్పి కొట్టేందుకు వజ్ర ప్రయోగాన్ని అమలు చేయడం వంటి సంఘటనలతో ఈ సినిమా సాగుతుంది. పుల్వామా దాడిలో సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడటం.. ఎప్పుడూ వారిస్తూ కనిపించే పై అధికారి ఏం జరిగినా చూసుకుందాం అంటూ రుద్ర సాహసాల్ని ప్రోత్సహించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథలోనే గాఢత లేకపోవడం, ఈ మధ్య వచ్చిన ఫైటర్ కథకి దీనికి చాలా దగ్గరి పోలికలు ఉండటం మైనస్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ ఫైలెట్ పాత్రలో ఒదిగిపోయారు. మానుషి చిల్లర్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కథనంలో మాత్రం బలం లేదు.

పాజిటివ్ పాయింట్స్ : 

  • దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు
  • వరుణ్ తేజ్, మానుషి చిల్లర్
  • విజువల్స్

మైనస్ పాయింట్స్ : 

  • కథనం
  • కొరవడిన భావోద్వేగాలు

రేటింగ్ : 3/5 

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేమలో పడ్డ డార్లింగ్..!

Visitors Are Also Reading