తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో సీజన్ షురూ అయింది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా పని చేస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొదటి రౌండ్’లో 14 మందిని పిలిచారు. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు.
Advertisement
ఈ రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాల్గోవ వారంలో రతిక, శుభశ్రీ , ఆరో వారం నయని పావని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజావెళ్లిపోయారు. ఇక ఎనిమిదో వారం సందీప్ ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి వారి తప్పులను, వారి గొడవలన్నింటినీ తెర మీదికి తీసుకొచ్చి వారు చెప్పింది తప్పు అయితే తప్పు అని.. ఒప్పు అయితే ఒప్పు అని చెబుతారు. అంతేకాదు.. ప్రతీ వీకెండ్ లో నాగార్జున రకరకాల డ్రెస్ లు వేసుకొని అదరగొడుతారు. లేటెస్ట్ గా ఎనిమిదో వారం వీకెండ్ లో ఎల్లో కలర్ షర్ట్ నెటిజన్స్ ని బాగా ఆకర్షించింది. నాగార్జున వేసుకొన్న ఆ షర్ట్ ఖరీదు రూ.26వరకు ఉంటుందని సమాచారం.
Advertisement
తాజాగా తొమ్మిదో వారం నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అర్జున్, రతిక, ప్రియాంక, అమర్ దీప్, యావర్, బోలే షవాలి, శోభాశెట్టి, టేస్టీ తేజ ఉన్నారు. వీరిలో యావర్ కి ఎక్కువగా ఓటింగ్స్ వస్తుండగా.. ఆ తరువాత బోలే ఉన్నారు. చివరగా ప్రియాంక, తేజ, శోభాశెట్టి ఉన్నారు. అందరికంటే తక్కువగా శోభాశెట్టికి కేవలం 4 శాతం ఓటింగ్ మాత్రమే వస్తుందని ఓ సర్వే వెల్లడించింది. ఈ వారంలో శోభాశెట్టి లేదా టేస్టీ తేజ వెళ్లిపోవచ్చని నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి మరీ.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!