ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాలు మరోసారి వాయిదా పడింది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమాలను వాయిదా వేసినట్లు ఆర్జీవీ తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం సినిమాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి వ్యూహం సినిమా రేపు విడుదల కావాల్సి ఉంది. ప్రొమోషన్స్ చేసుకోడానికి, అలాగే తమకు కావాల్సిన థియేటర్లు దక్కేందుకు సినిమా వాయిదా వేసినట్లు ఆర్జీవీ X (ట్విట్టర్) లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ ఈ సినిమా విడుదల ఆపేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. తాజాగా ఈ సారి సినిమా వాయిదా పడడానికి లోకేష్ కారణం కాదని సెటైరికల్ ట్వీట్ చేశారు వర్మ.
Advertisement
Advertisement
రాంగోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది. కొద్ది రోజులు వాయిదా వేసిన తరువాత విడుదల చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా థియేటర్ల సమస్య కారణంగా ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేశారు.
Also Read : బాలకృష్ణ-కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్ కాంబో ఎందుకు బ్రేక్ అయిందో తెలుసా ?