ఒక మనిషి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడు అంటే దాని వెనక ఎంతో కృషి పట్టుదల ఎంతో ఉంటుందనేది మనం తప్పనిసరిగా గమనించాలి. ఎన్టీఆర్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో కావడమే కాకుండా, రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనుడు. అలాంటి ఎన్టీఆర్ ఒకప్పుడు ఐదు రూపాయల కోసం నడుచుకుంటూ వెళ్లి వసూలు చేశారట. మరి అంతటి కష్టం వెనుక అసలు విషయం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.. ఆయన స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సమయంలోనే ఐదు రూపాయల కోసం సావిత్రి ఇంటికి వెళ్లి మరీ వసూలు చేశారట. మరి ఆ డబ్బులు వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం..
also read;త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?
ప్రస్తుత కాలంలో సినిమాలను రెమ్యూనరేషన్ ను బట్టి ఒప్పుకుంటున్నారు. కానీ అప్పట్లో అలా కాదు. నెలవారి జీతాలకు హీరో, హీరోయిన్లు, నటీనటులు పనిచేసేవారు. అలా ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య, సావిత్రి, వీరంతా జీతాలకి పనిచేసేవారట. అయితే మిస్సమ్మ సినిమా కొరకు, ఎన్టీఆర్ మరియు సావిత్రి జగ్గయ్య, సూర్యకాంతమ్మ పనిచేసే రోజులవి. అప్పట్లో అందరికీ కలిపి ఒకేసారి వేతనాలు ఇచ్చే అలవాటు వాహినీ స్టూడియో వారికి ఉండేది. అలా ఈ సినిమాకు ఈ నలుగురికి ఓకే చెక్కు రూపంలో రాసి ఎన్టీఆర్ కి ఇచ్చారు. దాన్ని పంచుకుంటే ఎన్టీఆర్ కు 75 రూపాయలు, సావిత్రి కి 70 రూపాయలు, రేలంగి 55, అక్కినేనికి 35 రూపాయలు అమౌంట్ వచ్చిందట.
ఈ పంపకం సమయంలో సావిత్రి 80 రూపాయలు తీసుకోవడంతో, ఎన్టీఆర్ కి 70 రూపాయలు మిగిలాయట. దీంతో మిగతా ఐదు రూపాయలు మరుసటి రోజు షూటింగ్ లో ఇస్తా అని సావిత్రి చెప్పిందట. కానీ అలా నెల రోజులు గడిచినా ఆమె అమౌంటు ఇవ్వకపోవడంతో, ఎన్టీఆర్ చేతిలో ఉన్న డబ్బంతా కూడా ఇంటికి పంపారట. ఇక డబ్బులు కావాలని ఎలాగైనా సావిత్రి దగ్గర వసూలు చేయాలని సావిత్రి ఇంటికి వెళ్లి అయిదు రూపాయలు తీసుకొని తమ రోజువారి ఖర్చులు తీర్చుకున్నారట.. ఇక ఇదే విషయమై రేలంగి మరియు సావిత్రి కొద్ది రోజుల వరకు నవ్వుకున్నారట.. ఏదిఏమైనా ఆ రోజుల్లో నటీనటుల మధ్య ఉన్న బాండింగ్ గొప్పదని చెప్పవచ్చు.
also read;బ్రహ్మాస్త్ర కోసం రాజమౌళి పడుతున్న కష్టం వెనుక అసలు కారణం తెలుసా..?